Begin typing your search above and press return to search.
కూతురు విషయంలో గొడవ!?
By: Tupaki Desk | 5 March 2017 7:42 AMసాధారణంగా ఏ ఇంట్లో అయినా ఏ కాపురంలో అయినా గొడవలు ఉంటాయి. కానీ సెలబ్రిటీలు.. స్టార్ల ఇళ్లలో ఏదైనా జరిగి అది బయటకు తెలిస్తే మాత్రం విపరీతమైన ప్రచారం దక్కుతుంటుంది. బచ్చన్ ఫ్యామిలీ వ్యవహారాల పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పటికే అభి ఐష్ ల మధ్య విబేధాలపై చాలానే వార్తలు రాగా.. ఇప్పుడు ఓ కొత్త వివాదం బయల్దేరిందిట.
ప్రస్తుతం కూతురు ఆరాధ్య విషయంలో ఈ అమ్మానాన్నలు ఇద్దరూ తెగ గొడవలు పడిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇవి నాలుగు గోడల స్థాయిని కూడా దాటిపోయాయట. విషయం పెద్దోళ్ల వరకూ తీసుకెళ్లే పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఇంతకీ అసలు గొడవ ఏంటంటే.. కూతురు ఆరాధ్యను వెండి తెర ముందుకు తేవాలన్నది అభిషేక్ బచ్చన్ ఆలోచన. పెద్దయ్యాక తన కూతురు ఎలాగూ స్టార్ అయిపోతుంది కాబట్టి.. ఇప్పటి నుంచి యాక్టింగ్ అలవాటు చేయాలని చూస్తున్నాడట.
కానీ రంగుల ప్రపంచంలో అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించి వచ్చిన ఐశ్వర్యారాయ్ మాత్రం.. ఆరాధ్య పెరిగి పెద్దయ్యాక ఏమవ్వాలో తనే నిర్ణయించుకుంటుందని అంటోందట. వీలైతే రంగుల ప్రపంచానికి దూరంగానే ఉంచాలన్నది ఆమె ఆలోచనగా తెలుస్తోంది. ఈ విషయంలో వీరిద్దరి మధ్య మనస్ఫర్ధలు ఎక్కువగానే ఉన్నట్లు టాక్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/