Begin typing your search above and press return to search.

నేను స్టార్ కొడుకుని అయినా ఎవరు ముందుకు రాలేదు: ప్రముఖ హీరో

By:  Tupaki Desk   |   24 Jun 2020 3:30 AM GMT
నేను స్టార్ కొడుకుని అయినా ఎవరు ముందుకు రాలేదు: ప్రముఖ హీరో
X
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణం మొత్తం దేశంలోని అన్నీ భాషలో సినీ ఇండస్ట్రీలలో చిచ్చురేపుతోంది. సుశాంత్ ఆత్మహత్యతో బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజమ్(బంధుప్రీతి) అనే పదం బాగా వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో బంధుప్రీతి రోజురోజుకి చర్చలకు దారి తీస్తుంది. అయితే గతంలో నుండి కూడా సినీ ప్రపంచంలో ఎంతోమంది సెలబ్రిటీలు తమ పిల్లలను లాంఛ్ చేశారు. అందరూ కాదు అందులో కొంతమంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నిస్తున్న కొత్తవారికి కూడా సహకరిస్తున్నారు. ఇటీవలే ఈ బంధుప్రీతి అంశం పై సినీ హీరో అభిషేక్ బచ్చన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. "నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేయమని ఎందరో నిర్మాతలను కలిశాను. నేను అమితాబచ్చన్ కొడుకుని అయినప్పటికీ ఒక్కరు కూడా నన్ను పరిచయం చేయడానికి ముందుకు రాలేదు.

అసలైతే నేను రాకేష్ మెహ్రా దర్శకత్వంలో తొలి సినిమా చేద్దామనుకున్నాను. కానీ నిర్మాతలెవరు నన్ను పరిచయం చేయడానికి ముందుకు రాలేదు. నాన్న కూడా చాలా ప్రయత్నాలు చేశారు. చివరకి జేపీ దత్తా నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ప్రస్తుత కరోనా సమయంలో ఓటీటీ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఆఖరికి ఓటీటీ విషయంలో కూడా నేను ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను..’’ అని అన్నారు. అభిషేక్ బచ్చన్ లాంటి స్టార్ కుమారుడికే తిప్పలు తప్పలేదు. అంటే మరి ఇండస్ట్రీ అనేది టాలెంట్ ఉన్నవాళ్ళని నిలబెడుతుంది. బంధుప్రీతి అనేది మొదట్లో రెండు మూడు సినిమాలకు పనికొస్తుందేమో కానీ అంతకుమించి పనికిరాదనేది గ్రహించాలని ఆయన సందేశం ఇచ్చినట్లు సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ అంశాన్ని కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.