Begin typing your search above and press return to search.

ఐష్ అందాలపై అభిషేక్ కేరింగ్

By:  Tupaki Desk   |   9 Nov 2017 6:58 AM GMT
ఐష్ అందాలపై అభిషేక్ కేరింగ్
X
సినీ తారలకు సంబంధించి పార్టీలు జరుగుతున్నాయి అంటే చాలు కెమరాలు ఒక్కసారిగా హీరోయిన్స్ అందాలపై మెరుపు దాడి చేస్తుంటాయి. ఏ మాత్రం సెక్సీగా గా కనిపించినా కూడా వారి ఫొటోస్ ని తీసేందుకు రెడీగా ఉంటారు. అయితే రీసెంట్ గా ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమెకు ఇలాంటి అనుభవాలు కొత్తేమి కాదు. కాకపోతే ఆమె భర్త అభిషేక్ బచ్చన్ మాత్రం ఐశ్వర్య పోటోలను తీసినందుకు కాస్త గరమయ్యాడు.

రీసెంట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన ఒక ప్రముఖ పార్టీలో ఐశ్వర్య రాయ్ అలాగే అభిషేక్ బచ్చన్ హాజరయ్యారు. ఫ్యాషన్ డిజైనర్ మనీష్‌ మల్హోత్రా ఇచ్చిన పార్టీ అది. అయితే ఈ పార్టీకి ఐష్ తన లెగ్స్ కనిపించేలా కొంచెం సెక్సీగా పొట్టి డ్రెస్సును వేసుకొచ్చింది. దీంతో కెమెరాలు మొత్తం ఆమె అందాలనే టార్గెట్ చేశాయి. ఎప్పుడూ కేన్స్ చలనచిత్రోత్సవంలో తన క్లీవేజ్ షోలతో మత్తెక్కించే ఐష్.. ఇలా కాళ్ల సౌందర్యం ఆరబోయడం ఎప్పుడో మానేసింది. సినిమాలకు ఫోటోషూట్లకు మాత్రం అలాంటి ఎక్సపోజింగ్ పరిమితం చేసింది.

ఇకపోతే అభిషేక్ పార్కింగ్ నుంచి కారులో వెళుతుండగా ఒక కెమెరామెన్ కారులో కూర్చున్న ఐష్ లెగ్స్ ని ఫొటో తీస్తుండడం చూసి కోప్పడ్డాడు. అతనితో వాగ్వివాదానికి దిగి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. వెంటనే ఫొటోస్ డిలీట్ కూడా చెయ్యాలని గట్టిగా చెప్పాడు. దీన్ని బట్టి మనకు ఒక విషయం తప్పకుండా తెలుస్తోంది. ప్రపంచ సుందరి లాంటి భార్యపై పరాయి కళ్లు పడకుండా కేరింగ్ గా చూసుకుకోవాలంటే చాలా కష్టమే సుమీ!!