Begin typing your search above and press return to search.
మళ్లీ ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో!
By: Tupaki Desk | 28 Jun 2023 5:00 AM GMTబిగ్ బీ అమితాబచ్చన్ వారసుడిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ముందుగా అభిషేక్ 'రెప్యూజ్' చిత్రంతో హిందీ తెరకు పరిచయయ్యారు. అటుపై ఆయన ప్రయాణం' దాస్వీ' వరకూ దిగ్విజయంగా సాగింది. అయితే నటుడిగా ఆయన జర్నీ మొదలై ఈనెల 30 తో 23 ఏళ్లు పూర్తవుతుంది. 'రెప్యూజ్' కూడా అదే రోజున రిలీజ్ అయింది. దీంతో అభిషేక్ బచ్చన్ మళ్లీ 'పికూ' దర్శకుడు సుజిత్ సర్కార్ ని లైన్ లోకి తెచ్చారు.
ఆ జాతీయ అవార్డు దర్శకుడితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈసినిమా ఆగస్టులో ప్రారంభ కానుందని తెలిపారు. అంతకు మించి ఎలాంటి వివరాలు లీక్ చేయలేదు. ఈ జోడీ 'పీకూ' సక్సెస గురించి చెప్పాల్సిన పనిలేదు.
ఏడేళ్ల క్రితం రిలీజ్ అయిన 'పీకూ' మంచి వసూళ్లని సాధించింది. 40 కోట్లలో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల వసూళ్లని సాధించింది. ఇందులో అభిషేక్ వచ్చన్ భాస్కర్ బెనర్జీ పాత్రలో కనిపించగా..దీపికా పదుకొణే పికూ బెనర్జీ పాత్రలో నటించింది.
కామెడీ డ్రామాగా తెరకెక్కిన సినిమా ఆద్యంతం నవ్వులు పువ్వులు పూయిస్తుంది. ఈ సినిమాకి జాతీయ అవార్డు కూడా వరించింది. ఈ నేపథ్యంలో అభిషేక్ బచ్చన్ మరోసారి నమ్మకంతో సుజిత్ ని తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సుజిత్ సర్కారు రెండేళ్లగా సినిమాలు చేయలేదు. చివరిగా 'సద్దామ్ ఉద్దమ్' తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది.
ఆ తర్వాత గ్యాప్ వచ్చింది. అయితే ఈ వ్యవధిలో ఓ బెంగాలీ సినిమా చేసారు. అయితే ఈ సినిమా హిందీలో అవకాశాలు రాక చేసారా? పనిగట్టుకుని బెంగాలీ చిత్రాన్ని తెరకెక్కించారా? అన్నది తెలియదు. తాజాగా అభిషేక్ బచ్చన్ అవకాశం ఇవ్వడంతో సుజిత్ సర్కార్ మళ్లీ రేసులోకి వస్తున్నట్లు తెలుస్తుంది.