Begin typing your search above and press return to search.
సీతయ్యలా శివతాండవమెత్తిన బచ్చన్ జీ!
By: Tupaki Desk | 2 Dec 2021 11:30 PM GMTబాలీవుడ్ స్టార్ కపుల్స్ అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యారాయ్ ఇటీవల కుమార్తె ఆరాధ్యతో కలిసి మాల్ధీవుల వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆరాధ్య పుట్టిన రోజు సందర్భంగా వేడుకను మాల్ధీవుల్లో నిర్వహించారు. ట్రిప్ అనంతరం ముంబై ఎయిర్ పోర్టులో మీడియా కంట పడ్డారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. అందులో ఆరాధ్య నడక గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయింది. దీంతో అభిషేక్ బచ్చన్ ట్రోలింగ్ పై మండిపడ్డారు. `నేను పబ్లిక్ ఫిగర్ ని కాబట్టి టార్గెట్ చేసినా ఫర్వాలేదు. కానీ నా కుతుర్ని టార్గెట్ చేస్తే మాత్రం ఊరుకోను. ఎందుకంటే నా బిడ్డకు మీకు ఎలాంటి సంబంధం లేదు.
``నిజంగా ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడండి`` అంటూ ట్రోలర్స్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అభిషేక్ గతంలో ఎన్నడూ వ్యక్తిగతంగా ఇంతగా సీరియస్ అయింది లేదు. వృత్తి పరంగా ఎలాంటి కామెంట్లు వచ్చినా పెద్దగా పట్టించుకోరు. కానీ కుమార్తె విషయం ట్రోలింగ్ కి గురవ్వడంతో శీతయ్యలా శివతాండవమెత్తేసారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోలింగ్ లు చాలా సహజం. కానీ అభిషేక్ మాత్రం కుమార్తెను టచ్ చేయడంతో అంతే సీరియస్ అయ్యారు.
ఇక అభిషేక్ నటిస్తోన్న కొత్త చిత్రం `బాబ్ బిశ్వాస్`. తొమ్మిదేళ్ల క్రితం రిలీజ్ అయిన సుజోయ్ ఘోష్ సినిమా `కహానీ` లో ఓ పాత్రకి కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో బెంగాలీ నటుడు శస్వత చటర్జీ పాత్ర చేయగా..ఇప్పుడు అభిషేక్ తో పూర్తి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక ఐశ్వర్యారాయ్ పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఫ్యామిలీ లైఫ్ కే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు.