Begin typing your search above and press return to search.
బాహుబలి రైటర్ కి బచ్చన్ ఫిదా
By: Tupaki Desk | 4 May 2017 4:26 AM GMTబాహుబలి ది కంక్లూజన్ మూవీ సృష్టిస్తున్న సెన్సేషన్స్ కు హద్దు లేకుండా పోతోంది. భారత దేశ సినీ చరిత్రనే తిరగరాసేస్తున్న బాహుబలి2 మూవీని.. అన్ని ఇండస్ట్రీల నుంచి ప్రశంసల సునామీ చుట్టుముట్టేస్తోంది. దర్శకుడు రాజమౌళి.. హీరో ప్రభాస్.. విలన్ రానాలకు ఎన్నెన్ని పొగడ్తలు వచ్చాయో లెక్కపెట్టడం.. బాహుబలి2 కలెక్షన్స్ ని కౌంట్ చేయడం కంటే కష్టంగా మారిపోయింది.
ఇప్పుడు బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కు ఫిదా అయిపోయానంటున్నాడు అభిషేక్ బచ్చన్. 'బాహుబలి2 విపరీతంగా నచ్చేసింది. మొత్తం టీంకు అభినందనలు.. రానా దగ్గుబాటి.. ఎస్ ఎస్ రాజమౌళి.. ప్రభాస్ లు సూపర్. విజయేంద్ర ప్రసాద్ గారి వర్క్ అద్భుతం' అన్నాడు జూనియర్ బచ్చన్. ఇప్పటివరకూ బాహుబలి టీంని పొగడ్డమే తప్ప.. ఆ మూవీ రైటర్ ను గుర్తించిన మొదటి బాలీవుడ్ సెలబ్రిటీ అభిషేక్. గుర్తించడమే కాదు.. ట్విట్టర్ ద్వారా పొగిడేశాడు కూడా.
నిజానికి బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయిన వెంటనే.. బాలీవుడ్ లో వచ్చిన సల్మాన్ ఖాన్ మూవీ భజరంగీ భాయిజాన్ వచ్చింది. దాని రైటర్ కూడా విజయేంద్ర ప్రసాద్ కావడం విశేషం. ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ రెండూ విజయేంద్ర ప్రసాద్ ఖాతాలో పడితే.. ఇప్పుడు బాహుబలి2తో ఇండియన్ సెన్సేషనల్ మూవీ కథను అందించిన రికార్డ్ ఖాతాలో వేసుకున్నాడీయన.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/