Begin typing your search above and press return to search.
అభిషేక్ అనుభవంతో చెప్పిన వాస్తవాలు!
By: Tupaki Desk | 28 July 2016 10:42 AM GMTబిగ్ బీ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అభిషేక్ 2000వ సంవత్సరంలో రెఫ్యూజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంటే అభిషేక్ ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి 16ఏళ్లవుతుందన్నమాట. ఈ 16ఏళ్ల కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు - ఆటుపోట్లను చూసిన అభిషేక్ తన అనుభవాలను పంచుకున్నారు. "సినీ పరిశ్రమలో 16ఏళ్లు పూర్తిచేసుకున్నాను, ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను.. మరెన్నో విషయాలు నేర్చుకున్నాను.. ఇది గొప్ప ప్రయాణం" అని మొదలుపెట్టిన అభిషేక్ ఇండస్ట్రీలో నిత్యకృత్యాలైన కొన్ని వాస్తవాలను కూడా సూటిగా చెప్పే ప్రయత్నం చేశారు!
విజయాలు ఉన్నప్పుడు అంతా పక్కన చేరతారు - మావాడు మావాడు అంటూ భుజాలకెత్తుకుంటారు.. నిత్యం ఫోన్ మోగుతూ ఉంటుంది.. ఇవి వాస్తవమే! అయితే ఒక్కసారి పరాజయం పలకరిస్తే.. తమను పలకరించడానికి మనిషే మిగలడు. ఫోన్ మూగబోతుంది - చుట్టూ ఉన్నవారంతా చడీచప్పుడు లేకుండా దూరం జరుగుతారు అని తన అనుభవాలతో రంగరించి చెప్పుకొస్తున్నారు అభిషేక్ బచ్చన్. ఈ విషయంలో చిన్న - పెద్ద తేడాలేమీ ఉండవు.. ఎంత చిన్న వాడికైనా ఇదే జరుగుతుంది.. పెద్ద వాడికైనా అదే జరుగుతుంది! ఆఖరికి భారతీయ సినిమా ఐకాన్ కొడుకు - ప్రపంచ సుందరి భర్త విషయంలోనూ ఇదే వాస్తవం అని చెప్పారు అభిషేక్!
ఒక్క ప్లాప్ గనుక పలకరిస్తే... దర్శక నిర్మాతలు ఫోన్ ఎత్తి మాట్లాడటం మానేస్తారనే పచ్చి నిజాన్ని పబ్లిగ్గా చెప్పేశారు అభిషేక్. ఇలా తన 16ఏళ్ల కెరీర్ లో చూసిన - స్వయంగా అనుభవించిన వాస్తవాలను చెప్పుకొచ్చారు అభిషేక్! కాగా.. గురు - ధూం - బంటీ ఔర్ బబ్లీ - దోస్తానా - బోల్ బచ్చాన్ బోల్ వంటి చిత్రాల్లో తన నటనకు ప్రశంసలందుకున్నారు ఈ జూనియర్ బచ్చన్!