Begin typing your search above and press return to search.

ఐష్ గురించి తప్పుగా కామెంట్ చేశారు

By:  Tupaki Desk   |   2 Nov 2017 4:31 PM GMT
ఐష్ గురించి తప్పుగా కామెంట్ చేశారు
X
అందాల తార ఐశ్వర్యారాయ్ బుధవారం తన 44వ పుట్టినరోజు ను హ్యాపీగా జరుపుకోంది. తల్లి వృందా రాయ్ తో కలిసి సిద్ధి వినాయకుడి గుడికి కూడా వెళ్లింది. ఆమెతో పాటు కుమార్తె ఆరాధ్య కూడా వెళ్లింది. ఇక సినీ ప్రముఖులు చాలా వరకు ఐశ్వర్య ఇంటికి వెళ్లి మరి విషెస్ ని అందించారు. ఇక చాలామంది అభిమానులు ఐశ్వర్య కు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పారు.

ఇకపోతే భర్త అభిషేక్ అండ్ కూతురు ఆరాధ్య విషెస్ ని మొదట అందుకుందంట ఈ ప్రపంచ సుందరి. అయితే అభిషేక్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సతీమణి గురించి ఓ రేంజ్ లో గొప్పగా చెప్పాడు. ఆయన మాట్లాడుతూ.. ఐష్ చాలా సింపుల్ గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతోంది. ఎప్పుడు గాని తనకు బెంజ్ కారు కాకుండా మారుతి పంపించినా.. అలాగే విమానంలో వెనుక సిటు ఇచ్చినా అంతగా పట్టించుకోదు. ఆమెకు అభిమానులంటే చాలా ఇష్టం. వారు కూడా ఐష్ ని ఇప్పటికే అందమైన మహిళగానే గుర్తిస్తారు.. అంటూ చెప్పాడు.

కానీ ఒక సందర్భంలో ఐశ్వర్య గురించి కొందరు తప్పుగా మాట్లాడారట. అలాగే కొన్ని మీడియాలలో తప్పుడు కథనాలు రాయడంతో.. అభిషేక్ ను చాలా బాధించిందట. ''ఆరాధ్య పుట్టిన తర్వాత ఐష్ లావైపోయిందని అందరూ కామెంట్ చేయడం నాకు బాధగా అనిపించింది. ఆ విషయం తనకు చెబితే ఇలాంటివి ఎక్కువ రోజులు ఉండవని చెప్పింది. ఆరాధ్య కోసం తను కెరీర్ ను వదిలేసుకుంది. కుతురంటే తనకు ఎంతో ఇష్టం. నా కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటోంది. అలాంటి మంచి మనసున్న మహిళ నా భార్యగా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది'' అని అభిషేక్ తన సతీమణి గురించి చెప్పాడు.