Begin typing your search above and press return to search.
కశ్మీర్ ఫైల్స్ అభిషేక్ కి దిగ్గజాల సన్మానం
By: Tupaki Desk | 6 April 2022 4:35 AM GMTఏదైనా ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమాని తెరకెక్కించి పెద్ద సక్సెస్ సాధిస్తే అభినందించేందుకు ఇండస్ట్రీ ప్రముఖులు ముందుకు వస్తారు. ఇటీవలి కాలంలో ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ కథాంశంతో కశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 300 కోట్లు పైగా వసూళ్లను సాధించడం ఒక సంచలనం. మంచి సినిమాని ప్రజలు ఆదరిస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ.
అయితే ఈ సినిమా నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ పేరు ఇటీవల ఫిలింసర్కిల్స్ లో మార్మోగుతోంది. అదే క్రమంలో అతడు వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులకు ప్రణాళికల్ని రచిస్తున్నారు. ఇంతకుముందే మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా టైగర్ నాగేశ్వరరావు లాంటి పాన్ ఇండియా సినిమాని లాంచ్ చేశారు.
ఇన్ సైడ్ సమాచారం మేరకు.. కశ్మీర్ ఫైల్స్ అభిషేక్ అగర్వాల్ ని పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ స్వగృహంలో సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి తెలుగు సినీపరిశ్రమ నుంచి భారీగా అతిథులు విచ్చేశారు. ఇందులో కొందరు భాజపా నాయకులు ఉన్నారు. తెలంగాణ తొలి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
దర్శకులు కృష్ణ చైతన్య- చందు మొండేటి - కథ రవి- లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి సహా ఇంకా చాలా మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక మంచి సినిమాతో నిర్మాతగా పేరు తెచ్చుకున్నందున ఈ సన్మానం. అలాగే తెలుగు సినిమాకి ఆయన చేస్తున్న సేవలకు ప్రశంసలు కురుస్తున్నాయి.
టైగర్ నాగేశ్వరరావుతో మరో లెవల్..
'ది కాశ్మీర్ ఫైల్స్' నిర్మాత అభిషేక్ అగర్వాల్ తదుపరి చిత్రం టైగర్ నాగేశ్వరరావుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి- వివేక్ అగ్నిహోత్రి హాజరయ్యారు. కాశ్మీర్ ఫైల్స్ భారీ విజయాన్ని సాధించింది.
టైగర్ నాగేశ్వరరావు లాంచింగ్ వేడుకకు జాతీయ మీడియా సైతం రావడం ఆసక్తిని కలిగించింది. ఈ సినిమాని తెలుగు-హిందీ-తమిళం సహా పలు భాషల్లో విడుదల చేయనున్నారు.