Begin typing your search above and press return to search.

కబాలి డీల్ తెగ్గొట్టేశారు..

By:  Tupaki Desk   |   15 July 2016 5:08 AM GMT
కబాలి డీల్ తెగ్గొట్టేశారు..
X
ఓ పక్క ‘కబాలి’ రిలీజ్ డౌట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసినా.. కొన్ని ఏరియాల్లో బిజినెస్ క్లోజ్ కాకపోవడంతో ఈ సినిమా మీద భారీగా పెట్టుబడి పెట్టిన యువ నిర్మాతలు తెగ టెన్షన్ పడిపోయారు. ఐతే తెలుగు రాష్ట్రాల్లోని ఓ పెద్ద ఏరియాలో బిజినెస్ డీల్ ఓకే అయిపోవడంతో ఊపిరి పీల్చుకునే అవకాశం దక్కింది. నైజాం ఏరియాకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ‘కబాలి’ పంపిణీ హక్కుల్ని సొంతం చేసుకోవడం విశేషం. ‘కబాలి’ తెలుగు వెర్షన్ హక్కుల్ని కె.పి.చౌదరి.. ప్రవీణ్ కుమార్ అనే ఇద్దరు కుర్ర నిర్మాతలు రూ.32 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రజినీ గత రెండు సినిమాలూ డిజాస్టర్లే అయినా.. ‘కబాలి’ మీద రికార్డు రేటు పెట్టేశారు వీళ్లిద్దరూ.

పెట్టుబడి మీద లాభాలకు సినిమాను అమ్మే ప్రయత్నంలో నైజాం ఏరియాకు రూ.10 కోట్ల రేటు పెట్టగా.. రజినీ గత సినిమాల ఫలితాల్ని దృష్టిలో ఉంచుకుని డిస్ట్రిబ్యూటర్లు భయపడ్డారు. ఐతే అభిషేక్ పిక్చర్స్ అధినేత మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి.. నిర్మాతలు చెప్పిన రేటుకు డీల్ ముగించాడు. నిజానికి ‘కబాలి’ మీద ఉన్న క్రేజ్ ప్రకారం చూస్తే.. ఈ సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. రూ.10 కోట్ల షేర్ రాబట్టడం అన్నది పెద్ద విషయం కాదు. ఈ సినిమాకు తొలి వారాంతం వచ్చే ఓపెనింగ్స్ తోనే పెట్టుబడిలో చాలా శాతం రాబట్టేయవచ్చు. మొత్తానికి నైజాం డీల్ ముగిసింది కాబట్టి.. మిగతా ఏరియాలు కూడా రెండు మూడు రోజుల్లో క్లియరైపోయే అవకాశాలున్నాయి.