Begin typing your search above and press return to search.
బిబి4: సగం ఓట్లు ఆ ఒక్కడికే
By: Tupaki Desk | 15 Dec 2020 11:16 AM GMTతెలుగు బిగ్ బాస్ ముగింపు వారంకు వచ్చేసింది. ఈ ఏడాది సీజన్ 4 ఉంటుందా ఉండదా అనుకుంటూ ఉండగా.. కరోనా ను ఎదిరించి నిర్వాహకులు బిగ్ బాస్ ను షురూ చేశారు. చూస్తుండగానే బిగ్ బాస్ సీజన్ 4 పూర్తి అయినట్లుగా అనిపిస్తుంది. ఈ సీజన్ మొదటి నుండి కూడా అభిజిత్ కు ఎక్కువ ఓట్లు పడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. గంగవ్వ ఉన్న సమయంలో సోషల్ మీడియాలో పెద్దగా లైమ్ లైన్ లోకి రాని అభిజిత్ ఆమె వెళ్లిన తర్వాత పూర్తిగా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు అంటున్నారు. చాకచక్యంగా ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అభిజిత్ అందరి కంటే ఎక్కువ సార్లు నామినేట్ అయ్యాడు. ప్రతిసారి అభిజిత్ కు ఎక్కువ ఓట్లు పడుతున్నట్లుగా చెబుతున్నారు.
ఫైనల్ వారంలో ఓట్ల సునామి అంటున్నారు. స్టార్ మా వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం వస్తున్న మొత్తం ఓట్లలో సగంకు పైగా ఓట్లు అభిజిత్ కే వస్తున్నట్లుగా తెలుస్తోంది. 50 నుండి 55 శాతం ఓట్లు అభిజిత్ కు వస్తుండగా మిగిలిన ఓట్లను ఇతర నలుగురు కంటెస్టెంట్స్ షేర్ చేసుకుంటున్నారు. రెండవ స్థానం విషయంలో టఫ్ పైట్ కొనసాగుతుంది. నలుగురు కూడా ఒక్కటి రెండు శాతం ఓట్ల తేడాతోనే రెండవ స్థానంలో మూడవ స్థానంలో ఉంటారు అనిపిస్తుంది.
రెండవ స్థానం విషయంలో ఎలాంటి ఊహలు మాత్రం చేయలేక పోతున్నారు. రెండవ స్థానం కంటెస్టెంట్స్ రోజు మారుతున్నట్లుగా స్టార్ మా వర్గాల వారు చెబుతున్నారు. సోషల్ మీడియాలో అభిజిత్ కు ఉన్న రెస్పాన్స్ ఏంటో ఇప్పటికే అర్థం అయ్యింది. ఈ వారంను లైట్ తీసుకోకుండా ఓట్ల సునామిని వారు కురిపిస్తున్నారు అంటున్నారు.