Begin typing your search above and press return to search.

శిరీష్ ని అల్లు అర‌వింద్ చెప్పుతో కొడ‌తా అన్నారా?

By:  Tupaki Desk   |   9 Nov 2022 1:30 PM GMT
శిరీష్ ని అల్లు అర‌వింద్ చెప్పుతో కొడ‌తా అన్నారా?
X
అల్లు శిరీష్ `శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు` త‌రువాత ఆ స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకుని చాలా కాల‌మే అవుతోంది. ఆ త‌రువాత రెండు మూడు సినిమాల్లో న‌టించినా అవేవీ పెద్ద‌గా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోయాయి. దీంతో కొంత విరామం తీసుకున్న దాదాపు మూడున్న‌రేళ్ల విరామం త‌రువాత రొమాంటిక్ ల‌వ్ స్టోరీ `ఊర్వ‌శివో రాక్ష‌సివో` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ధీర‌జ్ మోగిలినేని, విజ‌య్ నిర్మించారు.

అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా న‌టించింది. శీరీష్ దాదాపు మూడున్న‌రేళ్ల విరామం త‌రువాత న‌టించిన ఈ మూవీ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే మంచి టాక్ ని సొంతం చేసుకుని సూప‌ర్ హిట్ అనిపించుకుంది.

త‌మిళ హిట్ ఫిల్మ్ `ప్యార్ ప్రేమ కాద‌ల్‌` ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. యూత్ ని టార్గెట్ చేస్తూ తెర‌కెక్కించిన ఈ మూవీ మంచి టాక్ తో క‌న్న‌వుతూ ఆక‌ట్టుకుంటోంది.

ఇదిలా వుంటే అల్లు శిరీష్ తాజాగా అలీ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షోలో పాల్గొన్నారు. ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్లడించారు. `ఊర్వ‌శివో రాక్ష‌సివో` సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ ని అందుకున్నావ‌ని అనుకోవ‌చ్చా అంటే ఇంకా అనుకోవ‌డానికి వీలులేద‌ని, మాస్ సినిమా చేస్తే త‌ప్ప క‌మ‌ర్షియ‌ల్ సక్సెస్ ని సొంతం చేసుకున్నాన‌నే ముద్ర ప‌డ‌ద‌న్నాడు. అంతే కాకుండా ఇప్ప‌టి వ‌ర‌కు మంచి సినిమాలు చేశానే త‌ప్పితే క‌మ‌ర్షియ‌ల్ హిట్ ని సొంతం చేసుకోలేద‌న్నాడు.

ఇక ఇదే సంద‌ర్భంగా మీ నాన్న చేతిలో ఎక్కువ‌గా దెబ్బ‌లు తిన్న‌ది ఎవ‌రని అలీ అడిగితే పెద్ద‌న్న‌య్య వెంక‌టేష్ అని ఆ త‌రువాత తానే ఎక్కువ‌గా నాన్న చేత దెబ్బ‌లు తిన్నాన‌ని వెల్ల‌డించాడు. అంతే కాకుండా బ‌న్నీ చిన్న‌త‌నంలో చాలా సైలెంట్ గా వుండేవాడ‌ని, అందుకే అత‌న్ని నాన్న ఎక్కువ‌గా కొట్ట‌లేద‌న్నాడు. ఇక ఒక‌నోక సంద‌ర్భంలో తండ్రి అల్లు అర‌వింద్ చెప్పుతో కొడ‌తాన‌న‌న్న విష‌యాన్ని విష‌యాన్ని వెల్ల‌డించి షాకిచ్చాడు.

అప్ప‌ట్లో నాకు డ‌బ్బు విలువ తెలిసేతి కాద‌ని, త‌న‌కు 21 ఏళ్లు రాగాను నాన్న ద‌గ్గ‌రికి వెళ్లి నాకు కారు కావాల‌న్నాన‌ని, ఇత‌ర ప్రొడ్యూస‌ర్ల కొడుకుల‌కు కార్ లు వున్నాయ‌ని, త‌న‌కు ఎట్ట‌ప‌రిస్థితుల్లో కారు కావాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టాన‌ని అయితే అప్ప‌డు నాన్న `చెప్పుతీసుకుని కొడ‌తా` అన్నార‌ని తెలిపాడు. నేను ఇవ్వాల్సిన డ‌బ్బులు ఇస్తా.. కారు కావాలంటే నువ్వే కొనుక్కో అని చెప్పార‌ట‌. త‌ను సొంత కార్ కొనుక్కోవ‌డానికి మూడేళ్లు ప‌ట్టింద‌న్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.