Begin typing your search above and press return to search.
సంజూ టీంకు గ్యాంగ్ స్టర్ లీగల్ నోటీసులు
By: Tupaki Desk | 27 July 2018 6:23 AM GMTఇప్పుడు నడుస్తున్నదంతా బయోపిక్ ల కాలం. ఆ మధ్య వరకూ స్ఫూర్తివంతమైన వ్యక్తులు కనిపించటం లేదన్న కొరతను తీర్చేలా బయోపిక్ లు రావటం.. అవన్నీ కాసుల వర్షం కురిపించటంతో ఆ భాషా.. ఈ భాష అన్న తేడా లేకుండా అన్ని వుడ్డుల్లోనూ బయోపిక్ ల జోరు అంతకంతకూ పెరుగుతోంది.
తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ బయోపిక్ ను సంజూ పేరుతో రిలీజ్ చేయటం.. ఊహించని రీతిలో హిట్ కావటమే కాదు.. వసూళ్ల వర్షం కురిసేలా చేసింది. రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ మూవీ పుణ్యమా అని సంజయ్ దత్ మీద నెగిటివ్ పోగొట్టి.. పాజిటివ్ పెంచేలా ఈ సినిమా చేసింది.
సంజయ్ వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపించేందుకు దర్శకుడు పడిన తాపత్రయం తెర మీద కనిపించిందన్న విమర్శ పలువురి నోట వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ అబూ సలేం ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉందంటూ చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సంజు మేకర్స్ కు నోటీసులు పంపిన ఈ గ్యాంగ్ స్టర్. .తన పరువును దెబ్బ తీసేలా ఉన్న సీన్ ను 15 రోజుల్లో తొలగించాలని.. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించాడు. ఈ సినిమాలో 1993 ముంబయి పేలుళ్ల కేసుకు సంబంధించి తనకు అబూ సలేం ఆయుధాలు.. మందుగుండు సామాగ్రి సరఫరా చేశాడని రణబీర్ కపూర్ పాత్రతో చెప్పించారు. అసలు తన క్లయింట్ సంజయ్ దత్ ను ఒక్కసారి కూడా కలవలేదని అబూసలేం తరఫు లాయర్ నోటీసులో పేర్కొన్నారు. ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయలేదని.. అబూ పరువుకు భంగం కలిగించేలా సీన్ ను వెంటనే తొలగించాలని చిత్ర నిర్మాత.. దర్శకులకు నోటీసులు పంపారు. మరి.. దీనిపై సంజూ టీం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయినా.. సినిమా విడుదలైన ఇన్ని రోజులకు అబూ రియాక్ట్ కావటం ఏమిటి?