Begin typing your search above and press return to search.
ఇండియన్ సినిమాలకు ఆస్కార్ ఇందుకే దూరం
By: Tupaki Desk | 28 May 2019 6:20 AM GMTహాలీవుడ్ సినిమాలతో ఇండియన్ సినిమాలు పోటీ పడుతున్నాయి. కంటెంట్ పరంగా.. టెక్నాలజీ ఉపయోగించడంలో హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఇండియన్ సినిమాలు రూపొందుతున్నాయి. బడ్జెట్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో కూడా ఇండియన్ సినిమాలు ఆస్కార్ అవార్డులను దక్కించుకోవడంలో విఫలం అవుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఆస్కార్ ను తీసుకు రాలేక పోవడం విచారకరం. తాజాగా ఆస్కార్ అకాడమీ అధ్యక్షుడు జాన్ బెయిలీ ముంబయికి సతీ సమేతంగా వచ్చారు.
ముంబయిలో ఆస్కార్ అకాడమీకి సంబంధించిన కార్యాలయం ఏర్పాటుకు సంబంధించిన పనిపై ఆయన రావడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన ఇండియన్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హాలీవుడ్ లో కంటే ఇండియాలోనే ఎక్కువగా సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం 1800 సినిమాల వరకు విడుదల అవుతున్నట్లుగా తెలిసింది. ఈ సంఖ్య హాలీవుడ్ సినిమాల సంఖ్య కంటే నాలుగు రెట్టు అధికం. కాని మీ సినిమాల్లో భారతీయు సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే అంశాలేవి మాకు కనిపించడం లేదు. మాకు భారతీయ సినిమాల గురించి ఎక్కువగా తెలియదు.
ప్రపంచానికి మీ సాంప్రదాయాలను చెప్పే విధంగా మీరు సినిమాలు తీయడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా అలాంటి సాంప్రదాయాలు చూపించే సినిమాలకే ప్రాధాన్యత ఉందని ఇక్కడి ఫిల్మ్ మేకర్స్ గుర్తించాలంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇండియా నుండి విడుదలయ్యే మ్యూజికల్ సినిమాల ద్వారానే మాకు ఇండియన్ సినిమా గురించి తెలుసు. అంతకు మించి ఇండియన్ సినిమా గురించి తెలియక పోవడం వల్లే ఆస్కార్ అవార్డులు రావడం లేదేమో అనే అభిప్రాయంను వ్యక్తం చేశాడు.