Begin typing your search above and press return to search.

అనుకోకుండా ఫ్రెండ్ ఫోటోల్ని పంపితే సినిమా చాన్సు.. క్యూటీ ఓపెనైంది

By:  Tupaki Desk   |   27 Aug 2022 4:15 AM GMT
అనుకోకుండా ఫ్రెండ్ ఫోటోల్ని పంపితే సినిమా చాన్సు.. క్యూటీ ఓపెనైంది
X
టాలీవుడ్ లో హీరోయిన్లు ఎంతమంది ఉన్నా.. ఎప్పుడూ కొరతే. ఏ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినా మహా అయితే రెండు మూడేళ్లు.కాదంటే మరో ఏడాది.కానీ.. అలాంటి పరిస్థితి ఇటీవల కాలంలో కొందరు హీరోయిన్ల విషయంలో మారింది. ఇలాంటి తీరు శ్రియ..తమన్నా లాంటి వారితో షురూఅయ్యిందని చెప్పాలి.

ఏళ్లకు ఏళ్లు ఇండస్ట్రీలో ఉండి కూడా తమ సత్తాను చాటటమే కాదు.. తమకు లభించిన అవకాశాన్ని వినియోగించుకుంటూ తామేమిటో ఇప్పటికే ఫ్రూవ్ చేసుకున్న నటీమణుల జాబితాలో వారు నిలిచారు.

ఆ కోవలోకే వస్తారు అనుపమా పరమేశ్వరన్. క్యూట్ గా.. స్వీట్ గా ఉండటమే కాదు.. నటనకు అవకాశం ఉన్న విభిన్నమైన పాత్రల్ని చేసే ఆమె తాజాగా కార్తికేయ 2తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. చేసిన సినిమాలు తక్కువే అయినా..

ప్రేక్షకుల మనసులపై ముద్ర వేసే ఆమెకు బోలెడంతమంది అభిమానులు ఉన్నారు. 26 ఏళ్ల ఈ బ్యూటీ.. తన పద్దెనమిదో ఏటన ప్రేమమ్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలు 19 కాగా.. మరో రెండు పైప్ లైన్ లో ఉన్నాయి.

అగ్రహీరోయిన్లలో ఒకరిగా ఉంటూనే షార్ట్ ఫిలింస్ లోనూ చేసిన సాహసం అనుపమా సొంతం. తాజాగా జరిగిన ఒ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికర గతాన్ని వెల్లడించారు. తన స్నేహితురాలు సరదాగా ఆడిషన్ కోసం పంపిన ఒక ఫోటోతో తనకు సినిమాల్లోఅవకాశం వచ్చినట్లుగా గుర్తు చేసుకున్నారు.

ప్రేమమ్ మూవీలో తనను ఆశీర్వించిన ప్రేక్షకులు.. శతమానం భవతి మూవీలో మరో ఎత్తుకు తీసుకెళ్లారన్నారు. కెరీర్ లో నిలిచిపోయే మూవీగా కార్తికేయ 2 నిలుస్తుందన్నారు. తన మాటలతో తానెంత హ్యాపీగా ఉందన్న విషయాన్ని వెల్లడిస్తూ.. కార్తికేయ 2 సక్సెస్ ను తానెంత ఎంజాయ్ చేస్తున్నది చెప్పేశారు.