Begin typing your search above and press return to search.
'సన్ ఆఫ్ ఇండియా' ఎప్పుడొస్తాడు? ఏ వేదిక మీదకొస్తాడు?
By: Tupaki Desk | 16 July 2021 11:30 AM GMTకలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తన కెరీర్ లో ఎన్నో సందేశాత్మక చిత్రాలు - దేశభక్తి చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను అలరించారు. 560కి పైగా చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు. అయితే మోహన్ బాబు చాన్నాళ్ల తర్వాత దేశభక్తిని చాటిచెప్పడానికి.. మునుపెన్నడూ కనిపించని పవర్ ఫుల్ పాత్రతో ''సన్ ఆఫ్ ఇండియా'' అనే సినిమాతో రాబోతున్నారు.
డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మోహన్ బాబు స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. అలానే రఘువీర గద్యాన్ని పాట రూపంలో మలిచి రీమిక్స్ చేసిన 'జయ జయ మహావీర' సాంగ్ కూడా అలరించింది.
'సన్ ఆఫ్ ఇండియా' సినిమా విడుదల పై జూలై నెలాఖరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి పరిస్థితులను బట్టి ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా రిలీజ్ చేయాలా? లేదా థియేట్రికల్ రిలీజ్ చేయాలా? అనేది డిసైడ్ అవ్వాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఏదేమైనా డైలాగ్ కింగ్ మోహన్ బాబు చాలా గ్యాప్ తర్వాత సోలోగా నటిస్తున్న సినిమా కావడంతో.. 'సన్ ఆఫ్ ఇండియా' కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మేస్ట్రో ఇళయరాజా 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మోహన్ బాబు కోడలు విరానికా మంచు ఆయనకు స్టైలిస్ట్ గా వర్క్ చేస్తున్నారు. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుద్దాల అశోక్ తేజ పాటలు రాస్తున్నారు. డైమండ్ రత్నబాబు మరియు తోటపల్లి సాయినాథ్ కలసి సంభాషణలు రాస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ - ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తనికెళ్ళ భరణి - ఆలీ - వెన్నెల కిషోర్ - పృథ్వీరాజ్ - రాజా రవీంద్ర - రఘుబాబు - రవి ప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.