Begin typing your search above and press return to search.
కొత్త సినిమాలు తట్టుకుంటాయా?
By: Tupaki Desk | 26 April 2018 5:30 PM GMTసినీ ప్రియులకు చూస్తుండగానే వారం గిర్రున తిరిగిపోతుంది. వీకెండ్లో కొత్త సినిమాలు వచ్చి పడిపోతాయి. చలో అంటూ థియేటర్లకు వెళ్లిపోవడమే. గత కొన్ని వారాలుగా తెలుగులో ఒక వీకెండ్ కు ఒక్క సినిమా చొప్పునే విడుదలవుతున్నాయి. ఐతే ఈ వారం మాత్రం రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అవే.. ‘ఆచారి అమెరికా యాత్ర’.. ‘కణం’. ఈ సినిమాలపై అంచనాలు అంతంతమాత్రమే అని చెప్పాలి.
ఒక పెద్ద సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుందంటే.. సినీ ప్రియుల చర్చలు వారం పది రోజుల పాటు దాని చుట్టూనే తిరుగుతుంటాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. తెలుగు ప్రేక్షకుల దృష్టి ‘భరత్ అనే నేను’ మీదే ఉంది. ఈ సినిమా టార్గెట్ పెద్దది కావడంతో చిత్ర బృందం కూడా ప్రమోషన్లను కొనసాగిస్తోంది. రేపు విజయోత్సవ సభ కూడా పెడుతోంది. ఈ చిత్రానికి వీక్ డేస్ లో కూడా ఓ మోస్తరుగా వసూళ్లు వస్తున్నాయి. వీకెండ్ మీదా ఆశలు చాలా ఉన్నాయి. మరోవైపు మూడు వారాల కిందట విడుదలైన ‘రంగస్థలం’ ఇంకా ఉనికిని చాటుకుంటోంది.
ఇలాంటి తరుణంలో విడుదలవుతున్న ‘ఆచారి అమెరికా యాత్ర’.. ‘కణం’ సినిమాలు ఆ పెద్ద సినిమాల ధాటిని తట్టుకుంటాయా.. ప్రేక్షకాదరణకు నోచుకుంటాయా అన్నది సందేహం. ఈ రెండు సినిమాలూ వాయిదాల మీద వాయిదాలు పడి ఇప్పుడు విడుదల అవుతుండటంతో బజ్ అంతగా లేదు. మంచు విష్ణు ట్రాక్ రికార్డు తెలిసిందే. కాకపోతే నాగేశ్వరరెడ్డితో అతను ఇంతకముందు చేసిన రెండు సినిమాలూ హిట్లే. ఈసారి హిట్టు కొట్టి హ్యాట్రిక్ పూర్తి చేస్తానన్న ఆశతో ఉన్నాడు విష్ణు. ఈ చిత్రంలో కామెడీ పండితే సినిమా ఆడొచ్చు. మరోవైపు ‘కణం’ ద్విభాషా చిత్రమే అయినా.. నాగశౌర్య-సాయిపల్లవి జంటగా నటించినా.. దాన్ని ఒక డబ్బింగ్ సినిమాలాగే చూస్తున్నారు జనం. పైగా అది సీరియస్ సినిమా. అది ఏమేరకు జనాల్ని ఆకర్షిస్తుందో చూడాలి.