Begin typing your search above and press return to search.
కొత్త సినిమాలకు బుకింగ్స్ లేవు బాబోయ్..
By: Tupaki Desk | 27 April 2018 6:10 AM GMTవేసవిలో.. అది కూడా ఏప్రిల్ నెలాఖర్లో సినిమాను రిలీజ్ చేసుకోవడం ఏ నిర్మాతకైనా వరమే. ఇది ప్రైమ్ సీజన్ కాబట్టి ఈ సమయంలో పెద్ద సినిమాలే రిలీజ్ చేస్తుంటారు. నిజానికి ఈ వారాంతంలో ‘కాలా’ లాంటి భారీ సినిమా రావాల్సింది. కానీ అది అనివార్య కారణాల వల్ల వాయిదా పడటంతో ‘ఆచారి అమెరికా యాత్ర’.. ‘కణం’ సినిమాలు రిలీజవుతున్నాయి. ఐతే ఈ సినిమాలకు బజ్ అంతంతమాత్రంగా ఉంది. వీటి థియేటర్లలో ఆన్ లైన్ బుకింగ్ స్టేటస్ చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.
ఓ మోస్తరు స్థాయి ఉన్న సినిమాలకు తొలి రోజు మార్నింగ్ షోలకు 50 శాతం అయినా బుకింగ్స్ ఉంటాయి. కానీ ఈ కొత్త సినిమాలకు 20 శాతం ఆక్యుపెన్సీ కూడా కనిపించట్లేదు.
మంచు విష్ణు.. జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో ఇంతకుమందు వచ్చిన రెండు సినిమాలూ హిట్లే. ఆ సినిమాలకు మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. కానీ ‘ఆచారి అమెరికా యాత్ర’ విషయంలో బజ్ కనిపించడం లేదు. ఈ సినిమాను రెండు మూడు సార్లు వాయిదా వేయడం.. ఇప్పుడు పెద్దగా ప్రమోషన్లే చేయకుండా రిలీజ్ చేస్తుండటంతో జనాలకు సినిమా రిలీజ్ సంగతి కూడా తెలియనట్లుగా ఉంది. ఇక ‘కణం’ గురించైతే చెప్పాల్సిన పని లేదు. ఇది సీరియస్ లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో జనాలకు దీనిపై ఆసక్తి కనిపించడం లేదు. దీనికి తోడు ‘భరత్ అనే నేను’.. ‘రంగస్థలం’ ఇంకా బాగానే ఆడుతుండటం.. ఈ వీకెండ్లో వస్తున్న హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్’ తెలుగు రాష్ట్రాల్లోనూ బంపర్ క్రేజ్ తో రిలీజవుతుండటం కొత్త తెలుగు సినిమాలకు ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాలకు చాలా మంచి టాక్ వస్తే తప్ప మనుగడ కష్టమే అన్నట్లుంది పరిస్థితి.