Begin typing your search above and press return to search.
అవునా.. కొత్త సినిమాలు రిలీజయ్యాయా?
By: Tupaki Desk | 29 April 2018 3:30 PM GMTఏప్రిల్ చివరి వారం అంటే సినిమాలకు చాలా మంచి సీజన్ అన్నట్లే. ఈ టైంలో మామూలుగా చాలా పెద్ద సినిమాలు రిలీజవుతుంటాయి. గత ఏడాది ఇదే సమయంలో ‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజవడం విశేషం. అంతకుముందు కూడా ఏప్రిల్ చివరి వారంలో భారీ సినిమాలే రిలీజయ్యాయి. ఐతే ఈసారి ఈ వీకెండ్లో ఏమాత్రం రెండు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఐతే ఈ వారాంతానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఎలాంటి సినిమాకైనా కొంచెం హైప్ రావాలి. ఓపెనింగ్స్ బాగుండాలి. కానీ ఈ వారంలో రిలీజైన సినిమాల విషయంలో అలాంటిదేమీ కనిపించడం లేదు.
శుక్రవారం రిలీజైన ‘ఆచారి అమెరికా యాత్ర’.. ‘కణం’ సినిమాల గురించి అసలు డిస్కషనే లేదు టాలీవుడ్లో. అసలు ఈ సినిమాలు రిలీజైన సంగతి కూడా జనాలకు తెలియనట్లుగా ఉంది. వీటికి కనీస స్థాయిలో కూడా ప్రమోషన్లు లేకపోయాయి. వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ చిత్రాల్ని. ‘కాలా’ రాకపోవడంతో ఖాళీ దొరికింది కదా అని ఉన్నట్లుండి రిలీజ్ చేసేశారు. ప్రమోషన్లు కూడా లేకపోవడంతో ప్రి రిలీజ్ బజ్ ఏమీ లేకపోయింది. ఇంకా కొన్ని కారణాల వల్ల ఈ చిత్రాలపై అంచనాలే లేకపోయాయి. దీనికి తోడు టాక్ కూడా బ్యాడ్ గా ఉండటంతో ఇవి సోదిలో లేకుండా పోయాయి.
ముఖ్యంగా మంచు విష్ణు సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ ఔట్ డేటెడ్ అనిపించుకుంది. పూర్తి నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. అసలే విష్ణు ట్రాక్ రికార్డు బాగా లేదు. మార్కెట్ పడిపోయింది. దీనికి తోడు ఎలాంటి హైప్ లేకుండా వచ్చిన నెగెటివ్ టాక్ తెచ్చుకుంటే జనాలు సినిమాను ఏం పట్టించుకుంటారు? మరోవైపు ‘కణం’ను ముందు నుంచి ఒక డబ్బింగ్ సినిమాలాగే చూశారు. అదొక సీరియస్.. లేడీ ఓరియెంటెడ్ మూవీ. దీనికీ పబ్లిసిటీ కరవైంది. టాక్ అంతంతమాత్రమే. దీంతో దీనికీ వసూళ్లు లేవు. దీని గురించీ చర్చల్లేవు. పైగా ‘భరత్ అనే నేను’ బాగా ఆడుతోంది. దీనికి ప్రమోషన్ల హడావుడి కూడా బాగా కనిపిస్తోంది. మరోవైపు హాలీవుడ్ మూవీ ‘ఎవంజర్స్’ సందడి మామూలుగా లేదు. దీంతో కొత్త సినిమాల గురించి డిస్కషన్ లేకపోయింది.