Begin typing your search above and press return to search.
ఆచారి... ఈ సారైనా వస్తాడా?
By: Tupaki Desk | 11 April 2018 10:20 AM GMTఆచారి... అప్పుడెప్పుడో గణతంత్ర దినోత్సవ కానుకగా థియేటర్లలోకి వస్తున్నా అన్నాడు. మళ్లీ ఏమైందో ఏమో... ఎల్లుండి విడుదల అనగా వాయిదా వేస్తున్నాం! అంటూ ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత అప్పుడొస్తా... ఇప్పుడొస్తా అంటూనే ఉన్నాడు. కానీ ఇప్పటికి ఎప్పుడొస్తాడో సరైన డేటు మాత్రం చెప్పడం లేదు. మళ్లీ ఆచారి యాత్ర కొత్త డేటుని విడుదల చేసింది చిత్ర బృందం.
మంచు విష్ణు బ్రహ్మణ పంతులు పాత్ర పోషించిన ‘దేనికైనా రెఢీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. బ్రహ్మణుడిగా నటించేందుకు తెగ కష్టపడే ముస్లిం కుర్రాడి పాత్రలో మంచు విష్ణు నటన కూడా బాగానే చేశాడు. కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకుడు. దాంతో ఇదే కాంబినేషన్లో మళ్లీ ఇన్నాళ్లకు ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమా రూపొందింది. విష్ణు సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రజ్ఞా జైస్వాల్ కి ఈ సినిమా ఫలితం కీలకం కానుంది. పద్మజా పిక్చర్స్ రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా ఏప్రిల్ 27న విడుదల చేస్తామంటూ పోస్టర్ విడుదల చేసింది.
ఇదే తేదీన రజినీకాంత్ ‘కాలా’ సినిమా కూడా విడుదల కానుంది. అయితే తమిళనాడులో పరిస్థితి ఇంకా ఏటూ తేలకపోవడంతో కాలుడు రావడం డౌటే! దాంతో మహేష్ బాబుకీ- అల్లుఅర్జున్ కీ మధ్యలో రావాలని అనుకుంటున్నాడు మంచు విష్ణు. చూడాలి... ఈ సారైనా నవ్వుల యాత్ర అనుకున్న డేటుకి ప్రారంభమవుతుందో లేదో!