Begin typing your search above and press return to search.
'పుష్ప' మీద 'ఆచార్య' గురి..?
By: Tupaki Desk | 4 Oct 2021 11:41 AM GMTకోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం వల్ల వాయిదా పడుతూ వచ్చిన సినిమాలన్నీ ఒక్కటొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కారాణాలు ఏవైనా రెండు మూడేళ్ళుగా నడుస్తున్న సినిమాల్లో మొదటిగా అక్కినేని నాగచైతన్య 'లవ్ స్టొరీ' థియేటర్లలోకి వచ్చింది. ఇదే క్రమంలో అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' విడుదలకి రెడీ అయిపోయింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ వారు నిర్మించిన ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేస్తున్నారు. దీంతో పాటు చాలా రోజులుగా సెట్స్ మీదున్న ప్రభాస్ 'రాధే శ్యామ్' రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు. జనవరి 14న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ బ్యాచ్ చిత్రాల్లో మిగిలింది 'ఆచార్య' మాత్రమే.
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి - రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ''ఆచార్య''. 'భరత్ అనే నేను' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కొరటాల దాదాపుగా మూడేళ్ల నుంచి ఈ సినిమా మీదనే వర్క్ చేస్తున్నారు. మే 13న విడుదల చేయాలని అనుకున్న ఈ చిత్రాన్ని కరోనా కారణంగా వాయిదా వేశారు. అప్పటి నుంచి మరో రిలీజ్ డేట్ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలో దసరా బరిలో నిలపాలని ఆలోచన చేశారు కానీ.. ఏపీ లో టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో వెనకడుగు వేశారు. త్వరలో రేట్ల మీద ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్న తరుణంలో ఇప్పుడు సరైన డేట్ దొరకడం లేదు.
చిరంజీవి వరుసగా మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నారు కానీ.. 'ఆచార్య' గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. ఈ నేపథ్యంలో సినిమా విడుదల తేదీ పై డిస్కష్ చేయడానికి కొరటాల శివ అండ్ టీమ్ ఈరోజు డిస్ట్రిబ్యూటర్స్ తో మీటింగ్ పెట్టినట్లు సమాచారం. నిజానికి తడ్రీకొడుకులు చిరు - చరణ్ కలిసి నటిస్తున్న చిత్రాన్ని డిసెంబర్ 17న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారట. అయితే ఆలోపే అల్లు అర్జున్ - సుకుమార్ వచ్చి 'పుష్ప' పార్ట్-1 కోసం అదే డేట్ ని లాక్ చేసుకున్నారు. సంక్రాంతి కి తీసుకురావడానికి ఛాన్స్ లేదు. 'ఆర్.ఆర్.ఆర్' 'రాధే శ్యామ్' లతో పాటుగా మరికొన్ని సినిమాలు సంక్రాంతి బెర్తులు కన్ఫర్మ్ చేసుకున్నాయి.
'ఆచార్య' ను డిసెంబర్ 24న విడుదల చేస్తారనుకుంటే.. జనవరి 7న 'ఆర్ ఆర్ ఆర్' విడుదలకు చాలా దగ్గర అవుతుంది. ఫిబ్రవరి - మార్చి - ఏప్రిల్ నెలల్లో రిలీజ్ చేయడానికి ఇప్పటికే కొన్ని క్రేజీ మూవీస్ ఈ టైంలో డేట్స్ ఇచ్చేసాయి. అంతకుమించి ముందుకు వెళ్లాలంటే చాలా ఆలస్యం అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు 'పుష్ప' పనులు ఇంకా కంప్లీట్ అవకపోవడం వల్ల డిసెంబర్ 17 మీద కొరటాల - చిరంజీవి ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది.
'పుష్ప' షూటింగ్ శరవేగంగా జరుగుతున్నా పోస్ట్ వర్క్స్ పూర్తి చేసి సినిమాని రెడీ చేయడానికి చాలా సమయమే పట్టేలా ఉంది. ఒకవేళ అనుకున్న టైం కి 'పుష్ప' ని తీసుకురాలేకపోతే 'ఆచార్య' చిత్రాన్ని ఆ తేదీకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కాకపోతే బన్నీ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ క్రిస్మస్ సీజన్ లో తన చిత్రాన్ని రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న 'ఆచార్య' చిత్రానికి విడుదల తేదీ మాత్రం అంత ఈజీగా దొరికేలాలేదనేది అర్థం అవుతోంది. మరి డిసెంబర్ 17న పుష్పరాజ్ వస్తాడో? ఆచార్య ను తీసుకొస్తారో చూడాలి.