Begin typing your search above and press return to search.
మెగాస్టార్ కు మరో షాక్ ఇచ్చిన ఆచార్య
By: Tupaki Desk | 3 Nov 2022 3:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక విధంగా ఇది మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మొత్తంలోనే కాకుండా టాలీవుడ్ చరిత్రలో కూడా అత్యధిక నష్టాలను కలిగించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా మెగా అభిమానులకు అయితే ఇదొక పెద్ద షాక్ అనే చెప్పాలి.
ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు నిరాశ మిగిలింది. దానికి తోడు సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నష్టపరచడం కూడా మర్చిపోలేని మరొక చేదు అనుభవం.
అయితే ఈ సినిమా మిగిల్చిన చేదు అనుభవాలు అన్నీ కావు. కొరటాల శివ ఇంకా డిస్ట్రిబ్యూషన్స్ కు సంబంధించిన వ్యవహారాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నడు.
అయితే ఓటీటీలో విడుదలైనా కూడా ఈ సినిమా అక్కడ కూడా పెద్దగా రెస్పాన్స్ ఏమీ అనుకోలేదు. ఇక శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ భారీ రేటుకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పుడే జెమినీ టీవీ డీల్ క్యాన్సిల్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు కూడా టాక్ వచ్చింది. కానీ అదేమీ నిజం కాదు అని ఆ తర్వాత అర్థం అయింది. ఇక ఇప్పుడు మొదటిసారి ఇటీవల జెమినీ టీవీలో ఆచార్య సినిమాను టెలికాస్ట్ చేయగా అతి తక్కువ స్థాయిలో రేటింగ్స్ అందుకుంది.
సీనియర్ హీరోలలో అక్కినేని నాగార్జున బంగార్రాజు సినిమా మొదటిసారి ప్రసారమైనప్పుడు 14 టిఆర్పి అందుకుంది. ఇక బాలకృష్ణ అఖండ సినిమా 13.31 టిఆర్పిని అందుకుంది. ఆఖరికి వెంకటేష్ ఎఫ్2 సినిమా ఎనిమిదికి పైగా టీఆర్పీ రేటింగ్ అందుకోగా ఇప్పుడు ఆచార్య సినిమా అంతకంటే తక్కువ స్థాయిలో 6.30 టీఆర్పీ రేటింగ్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక దీన్ని కూడా మెగా విరోధులు ట్రోలింగ్స్ చేస్తూ మరింత వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఇక మెగాస్టార్ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో రానున్న విషయం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.