Begin typing your search above and press return to search.
'ఆచార్య' రెండు ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్
By: Tupaki Desk | 28 April 2021 4:00 AM GMTమెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ఆచార్య మే 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆచార్య మాత్రమే కాదు ఏ ఒక్క సినిమా విడుదల అయ్యే పరిస్థితి లేదు. కనుక ఇప్పటి వరకు ఆచార్య విడుదల వాయిదా విషయం అధికారికంగా ప్రకటించకున్నా కూడా ఇప్పటికే అంతా అర్థం చేసుకున్నారు. సినిమా షూటింగ్ కూడా ఇంకా బ్యాలన్స్ ఉంది. షూటింగ్ ను ముగించాలని సెకండ్ వేవ్ లో కూడా షెడ్యూల్ ప్లాన్ చేశారు. కాని సోనూసూద్ కు కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ ను నిలిపి వేశారు. రామ్ చరణ్ మరియు సోనూసూద్ ఇంకా చిరంజీవి పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. ఈ సినిమా గురించిన రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తున్నాయి.
ఈ సినిమా కేవలం 10 వర్కింగ్ డేస్ లో పూర్తి అవ్వనుందట. 10 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉన్న ఈ సినిమా ను జూన్ నెలలో ప్రారంభించి ముగించాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మొత్తం తగ్గిన తర్వాత ఆచార్యను విడుదల చేయాలని కూడా మేకర్స్ చూస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆచార్య సినిమాను ఆగస్టులో చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఆగస్టులో ఇతర సినిమాలు ఉన్నా కూడా వాటితో పోటీ లేకుండా వారం గ్యాప్ తో విడుదల చేయాలని చూస్తున్నారట.
ఆగస్టులో విడుదల కాని పక్షంలో సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని కూడా కొరటాల టీమ్ భావిస్తుంది. మొత్తానికి ఆచార్య సినిమా గత ఏడాది నుండి ఈ ఏడాదికి షిప్ట్ అయ్యింది. మే నుండి ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ఈ సినిమా వాయిదా పడింది. ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ అంచనాలు భారీగా పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. చిరుతో పాటు ఈ సినిమాలో చరణ్ కూడా నటిస్తున్న కారణంగా అంచనాలు మరింతగా పెరిగాయి.
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ మరియు చరణ్ కు జోడీగా పూజా హెగ్డే లు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా నక్సల్స్ మరియు టెంపుల్స్ బ్యాక్ గ్రౌండ్ లో సాగుతుందని సమాచారం. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.