Begin typing your search above and press return to search.
దీపావళికి కూడా క్లారిటీ లేని 'ఆచార్య'
By: Tupaki Desk | 5 Sep 2021 4:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి.. కొరటాల కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినిమా విడుదల గత ఏడాదిలోనే ఉండాల్సినా కరోనా వల్ల ఈ ఏడాదికి పోస్ట్ పోన్ అయ్యింది. మే నెలలో ఖచ్చితంగా విడుదల చేస్తారని భావిస్తున్న సమయంలో సెకండ్ వేవ్ కారణంగా మొత్తం పరిస్థితి తలకిందులు అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా అసలు ఈ ఏడాదిలో వచ్చే అవకాశం ఉందా అంటూ చాలా మంది అనుమానాలు పెట్టుకున్నారు. మొన్నటి వరకు దసరాకు ఆర్ ఆర్ ఆర్ రావడం లేదు కనుక ఆచార్య ను దించే అవకాశాలు ఉన్నాయని కొందరు భావించారు. కాని షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది కనుక దసరాకు విడుదల సాధ్యం కాదని తేలిపోయింది. ఆ తర్వాత దీపావళికి సినిమా పక్కాగా విడుదల అవుతుంది అనే నమ్మకంతో అంతా వెయిట్ చేస్తున్న సమయంలో అనూహ్యంగా మళ్లీ వాయిదా పడుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆచార్య సినిమా విడుదల కోసం ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ దీపావళి. ఆరోజున ఒక వేళ ఆచార్య రాకుంటే సంక్రాంతికి ఉన్న పోటీ నేపథ్యంలో రావడం సాధ్యం అయ్యే పని కాదు. సంక్రాంతి సందర్బంగా విడుదల కావాల్సిన సినిమాలు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా అంటే డౌటే అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆచార్య ను సంక్రాంతికి కాకుండా మళ్లీ సమ్మర్ వరకు వెయిట్ చేయించాల్సిందే అనేది కొందరి టాక్. దీపావళి వరకు వర్క్ ముగించి విడుదల చేయాలని భావించినా కూడా థర్డ్ వేవ్ భయం ఒకటి ఉంది. దాని వల్ల సినిమా విడుదల ఎంత వరకు అవుతుంది.. అయినా కూడా ఎంత వరకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతారు అనేది తెలియడం లేదు. అందుకే ఈ ఏడాదిలో ఆచార్య ను విడుదల చేయక పోవడం మంచిది అనే అభిప్రాయంకు యూనిట్ సభ్యులు వచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.
కేవలం ఆచార్య మాత్రమే కాకుండా ఇలా నెలలకు నెలలు వాయిదాలు పడుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి. సోషల్ మీడియాలో చాలా సినిమాల విడుదల తేదీల విషయంలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఊహించేసుకుంటున్నారు. కాని పరిస్థితులు మాత్రం సినిమాల విడుదలకు అనుకూలంగా లేవు అంటూ టాక్ వినిపిస్తుంది. చిన్న సినిమాల వరకు ఇప్పుడు విడుదలకు నో ప్రాబ్లం. కాని బడా సినిమాలు విడుదల అవ్వాలంటే మాత్రం పరిస్థితులు కుదుట పడాలి.. అంతే కాకుండా ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న టికెట్ల రేట్ల తో సినిమాల ను విడుదల చేయడం సాధ్యం అయ్యే పని కాదు అంటూ కొందరు బయ్యర్లు చెబుతున్నారు. కనుక పెద్ద సినిమాలు విడుదల వాయిదా పడటానికి అది కూడా ఒక కారణం అయ్యి ఉంటుంది అనడంలో సందేహం లేదు. వచ్చే ఏడాది వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.
ఆచార్య సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ చాలా ప్రత్యేకంగా సినిమాను తెరకెక్కించాడు అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు ఖాయం అనుకుంటూ ఉండగా సినిమా విడుదల విషయంలోనే ఇలా ఇబ్బందులు తలెత్తడం విచారకరం అంటూ అభిమానులు నిట్టూర్చుతున్నారు. అయితే ఆచార్య ఎప్పుడు వచ్చినా ది బెస్ట్ గా ఉంటుంది అనేది చాలా మంది నమ్మకం.