Begin typing your search above and press return to search.

'ఆచార్య' రిలీజ్ పై అస్ప‌ష్ట‌త‌? దేనికింత గంద‌గోళం!

By:  Tupaki Desk   |   17 Feb 2022 10:30 AM GMT
ఆచార్య రిలీజ్ పై అస్ప‌ష్ట‌త‌? దేనికింత గంద‌గోళం!
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `ఆచార్య` రిలీజ్ కోసం మెగాప్రేక్ష‌కాభిమానులు ఎంత ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు. సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అవ్వాల్సిన సినిమా కోవిడ్ స‌హా..`ఆర్ ఆర్ ఆర్` ఆడ్డంకిగా ఉండ‌టంతో వాయిదా ప‌డ‌క త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలో..అంత‌కు ముందు..త‌ర్వాత ప‌లు తేదీల్ని ప్ర‌క‌టించ‌డం వెన‌క్కి తీసుకోవ‌డం జ‌రిగింది. `

ఆర్ ఆర్ ఆర్` కి ముందు రిలీజ్ అవుతుందా? త‌ర్వాత రిలీజ్ అవుతుందా? అన్న దానిపై అప్పట్లో అస్ప‌ష్ట‌త ఉన్న మాట వాస్త‌వం. కానీ జ‌క్క‌న్న కండీష‌న్ ప్ర‌కారం `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ త‌ర్వాతనే `ఆచార్య `రిలీజ్ అవ్వాల‌న్న‌ది నిబంధ‌న ఉండ‌టంతో `ఆర్ ఆర్ ఆర్` త‌ర్వాత‌నే `ఆచార్య` అని క్లారిటీ వ‌చ్చింది.

ఇక `ఆర్ ఆర్ ఆర్` పాన్ ఇండియా కేట‌గిరిలో మార్చి 25న అన్ని భాష‌ల్లోనూ రిలీజ్ అవుతుంది. ఇందులో ఎలాంటి గంద‌ర‌గోళం లేదు. అనూహ్యంగా మ‌ళ్లీ క‌రోనా థ‌ర్డ్ వేవ్ విరుచుకుపడితే త‌ప్ప వాయిదా ప‌డే అవ‌కాశం లేద‌ని తాజా ప‌రిస్థితిల్ని బ‌ట్టి చెప్పొచ్చు. అయితే `ఆచార్య` రిలీజ్ పై మ‌రోసారి గంద‌ర‌గోళం నెల‌కొంది.

ఈ చిత్రం ముందుగా ఏప్రిల్ 4న రిలీజ్ అవుతుంద‌ని ప్ర‌చారం సాగింది. ఆ త‌ర్వాత ఆ నెలాఖ‌రు 29 వ‌ర‌కూ వాయిదా పడింద‌ని సోష‌ల్ మీడియా క‌థ‌నాలు వేడెక్కించాయి. చివ‌రిగా ఏ ప్రిల్ 1న వ‌చ్చేస్తుంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. అయితే ఇప్పుడీ తేదీకి కూడా `ఆచార్య` రిలీజ్ కావ‌డం లేద‌న్న వార్త ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు హిందీలో కూడా ఏక కాలంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో డేట్ విష‌యంలో ఏదైనా క్లారిటీ లోపించిందా? లేక ఇత‌ర కార‌ణాలు ఏవైనా ఉన్నాయా? అన్న‌ది తెలియాలి. ఇదే నిజ‌మైతే ఇంత హ‌ఠాత్తుగా మ‌ళ్లీ తేదీ ఎందుకు మారుతున్న‌ట్లు? ఒక‌వేళ `ఆర్ ఆర్ ఆర్` గ‌నుక వాయిదా ప‌డిందా? లేక క‌రోనా నాల్గ‌వ రూపం దాల్చుతుందా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. `ఆచార్య‌`కి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు దాదాపు పూర్తి అయ్యాయి. ఒక‌వేళ బ్యాలెన్స్ ఉన్నా 45 రోజుల‌కు పైగా స‌మ‌యం ఉంది. కాబ‌ట్టి ఆ ర‌కంగా `ఆచార్య` టీమ్ కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు.

ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలు విశ్లేషించుకుంటే ఏ కార‌ణంగా `ఆచార్య` మ‌ళ్లీ వాయిదా ప‌డుతుంద‌న్న‌ది అంతు చిక్క‌డం లేదు. మ‌రి దీనిపై క్లారిటీ రావాలంటే మేక‌ర్స్ మ‌రోసారి స్ప‌ష్ట‌త ఇవ్వాల్సి ఉంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్ష‌న్ కంపెనీ-మ్యాట్ని ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 140 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. సినిమా హిందీ రైట్స్ భారీ ధ‌ర ప‌లుకుతున్న‌ట్లు స‌మాచారం. కార్పోరేట్ కంపెనీల‌తో రామ్ చ‌ర‌ణ్ డీల్స్ మాట్లాడుతున్న‌ట్లు స‌మాచారం. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.