Begin typing your search above and press return to search.
పుకార్లుకు చెక్ పెట్టిన `ఆచార్య`
By: Tupaki Desk | 19 Dec 2021 4:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం `ఆచార్య`. ఇందులో ఇద్దరు నక్సలైట్ లుగా అత్యంత ప్రభావ వంతమైన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అభ్యుదయ కథలకు కమర్షియల్ అంశాల్ని జోడించి పవర్‌ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ లుగా తీర్చి దిద్దడంలో దర్శకుడు కొరటాలది ప్రత్యేక శైలి. ఆయన తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై వస్తున్న రూమర్ లకు ఆదివారం చిత్ర బృందం చెక్ పెట్టింది.
ఈ చిత్రాన్ని ఫబ్రవరిలో రిలీజ్ చేస్తున్నామంటూ చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడుతోందంటూ పుకార్లు మొదలయ్యాయి. కొన్ని రీ షూట్ ల కారణంగా సినిమా రిలీజ్ ఆలస్యమయ్యే అవకాశాలు వున్నాయని, దాంలో `ఆచార్య` అనుకున్న సమయానికి ఫిబ్రవరిలో విడుదల కావడం లేదంటూ ప్రచారం మొదలైంది. ఈ ప్రచారానికి `ఆచార్య` టీమ్ ఆదివారం చెక్ పెట్టింది.
నెట్టింట ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతోందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ముందు ప్రకటించిన ఫిబ్రవరి 4నే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నాం. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ కూడా పూర్తయింది. సినిమా ప్రకటించిన దగ్గరి నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు, ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందరి అంచనాలకు తగ్గట్లే సినిమా వుంటుంది` అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా సోను సూద్ నటించారు. ఓ మధ్య తరగతి వ్యక్తి వ్యవస్థపై వున్న కోపంలో నక్సలైట్ ఉద్యమంలోకి వెళతాడు. ఆ తరువాత అతనే సామాజిక కార్యకర్తగా మారి దేవాదాయ శాక చుట్టు జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమర శంఖం పూరిస్తాడు. ఈ దశలో ఆచార్యకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? .. ఇంతకీ సిద్ధా ఎవరు? .. అతనితో ఆచార్యకున్న అనుబంధం ఏంటి అనే ఆసక్తికరమైన కథా, కథనాలతో ఈ చిత్రాన్ని ఓ సమాజిక సమస్యకు కమర్షియల్ హంగుల్ని జోడించి దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. చిరు సినిమాల్లోని పాటల్లో మాత్రమే మెరిసే రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన చిత్రం కావడం.. ఇటీవల విడుదల చేసిన టీజర్‌లలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.