Begin typing your search above and press return to search.

చిరుకి అస్వ‌స్థ‌త నిజం కాద‌న్న కొణిదెల‌ వ‌ర్గాలు

By:  Tupaki Desk   |   10 March 2021 4:30 AM GMT
చిరుకి అస్వ‌స్థ‌త నిజం కాద‌న్న కొణిదెల‌ వ‌ర్గాలు
X
మెగాస్టార్ చిరంజీవి స్వ‌ల్ప‌ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారా? అంటే అవుననే సోష‌ల్ మీడియాల్లో ప్ర‌చారమైంది. ప్ర‌స్తుతం ఆచార్య షూటింగ్ కోసం ఖ‌మ్మం వెళ్లిన ఆయ‌న‌కు వ‌డ‌దెబ్బ త‌గిలింద‌ని .. ఇల్లెందు స‌మీపంలోని గ‌నుల్లో చిత్రీక‌ర‌ణ కావ‌డంతో ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల డీహైడ్రేష‌న్ కి గుర‌య్యార‌ని ప్ర‌చార‌మైంది.

ఈ అస్వ‌స్థ‌త వ‌ల్ల మ‌రో నాలుగురోజుల పాటు చేయాల్సిన షూట్ ని ఆపేసి చిత్ర‌బృందం హైద‌రాబాద్ కి చేరుకుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అయితే ఇదంతా నిజమా? అని ప్ర‌శ్నిస్తే కేవ‌లం పుకార్లు మాత్ర‌మేన‌ని కొణిదెలా కాంపౌండ్ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి.

మెగాస్టార్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఖ‌మ్మంలోనే శ్రీ‌కారం ప్రీఈవెంట్లోనూ పాల్గొన్నారు క‌దా.. అని క్లారిటీ ఇవ్వ‌డంతో పుకార్లు ఎంత వేగంగా స్ప్రెడ్ అవుతాయో మ‌రోమారు ప్రూవైంది.

ఖ‌మ్మంలో మంత్రి పువ్వాడ‌ అజయ్ కుమార్ ఇంట్లోనే మెగాస్టార్ కి బ‌స ఏర్పాటు చేయ‌గా ఆయ‌న మొన్న‌టి సాయంత్రం ఎంతో హుషారుగా శ‌ర్వానంద్ శ్రీ‌కారం ఈవెంట్లో పాల్గొని టీమ్ కి విషెస్ తెలిపారు. ఇంత‌లోనే డీహైడ్రేష‌న్ అంటూ ప్ర‌చారం సాగింది.

మేలో ఆచార్య రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది. దీంతో కొర‌టాల శ‌ర‌వేగంగా షూటింగ్ ని పూర్తి చేస్తున్నారు. టీమ్ కి స‌హ‌క‌రిస్తూ మెగాస్టార్ ఎంతో జోష్ తో క‌నిపిస్తున్నార‌ని ఇన్ సైడ్ సోర్స్ చెబుతోంది. ప‌ర్ఫెక్ట్ డైట్..హెల్దీ హ్యాబిట్స్ తో చిరు ఏజ్ తో సంబంధం లేకుండా హుషారుగా షూటింగుల్లో పాల్గొన‌డం అభిమానుల్లో ఉత్సాహం పెంచుతోంది. ఇప్ప‌టికిప్పుడు ఆయ‌న వ‌రుస‌గా నాలుగు సినిమాల‌కు క‌మిటైన సంగ‌తి తెలిసిందే.