Begin typing your search above and press return to search.
పుష్ప రాజ్ ను దెబ్బేసిన ఆచార్య..?
By: Tupaki Desk | 6 Oct 2021 3:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ''ఆచార్య''. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఎప్పుడు విడుదల చేస్తారనే విషయం మీద అనేక చర్చలు జరుగుతున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాలన్నీ రిలీజ్ డేట్ ని లాక్ చేసి పెట్టుకుంటున్నా.. 'ఆచార్య' మాత్రం ఇన్నాళ్లూ ఎటూ తేల్చుకోలేకపోయారు.
'ఆచార్య' చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ముందుగా ఆలోచన చేశారు. అయితే ఏపీలో టికెట్ రేట్ల పెంపుదల మీద స్పష్టత రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి చాలానే ప్రయత్నాలు చేసారు. అయితే 'ఆర్.ఆర్.ఆర్' సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో 'ఆచార్య' మరో దారి వెతుక్కోవాల్సి వచ్చింది.
ఇప్పటివరకు జనవరి లోనే విడుదల చేయాలని భావించిన మేకర్స్ కన్ను.. ఇప్పుడు క్రిస్మస్ మీద పడింది. దీపావళి కి 'అఖండ' 'ఖిలాడి' వంటి సినిమాలు వచ్చే అవకాశం ఉండటంతో 'ఆచార్య' ను డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారట. కాకపోతే డిసెంబర్ 17న 'పుష్ప: ది రైజ్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మైత్రీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆచార్య - పుష్ప మేకర్స్ మధ్య మంతనాలు జరుగుతున్నాయి.
చిరంజీవి - రామ్ చరణ్ - కొరటాల 'ఆచార్య' చిత్రాన్ని డిసెంబర్ 17న రిలీజ్ చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. 24వ తేదీన విడుదల చేయడానికి.. జనవరి 6న చరణ్ నటించిన 'RRR' సినిమా ఉంది. అందుకే చేస్తే 'పుష్ప' తేదీకే చేయాలని ఫిక్స్ అయ్యారు. మరోవైపు 'పుష్ప' పాన్ ఇండియా సినిమా కావడంతో.. ఈ డేట్ వదులుకుంటే ఇప్పట్లో మరొక మంచి రోజు దొరికే పరిస్థితి లేదని నిర్మాతలు ఆలోచించారని తెలుస్తోంది.
అయితే 'పుష్ప' షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం - పోస్ట్ ప్రొడక్షన్ - ప్రమోషన్స్ ఇతరత్రా కారణాలు చూపిస్తూ.. 'ఆచార్య' డిసెంబర్ 17 ను తీసుకున్నారట. సోమవారం జరిగిన డిస్ట్రిబ్యూటర్స్ - బయ్యర్ల మీటింగ్ లో దర్శకుడు కొరటాల శివ 17వ తేదీనే సినిమాని విడుదల చేయనున్నట్లు చెప్పినట్లు టాక్ నడుస్తోంది. ఇదే విషయాన్ని రేపు గురువారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కూడా అంటున్నారు.
ఇదే కనుక నిజమైతే 'పుష్ప' సినిమా మరో మంచి తేదీని వెదుక్కోవాల్సి ఉంటుంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి నేషనల్ వైడ్ థియేటర్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని డేట్ ని లాక్ చేయడం మేకర్స్ కు కష్టమైన విషయమే. మరి ఏమి జరుగుతుందో చూడాలి.
కాగా, 'ఆచార్య' చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్.. చరణ్ కు జోడీగా పూజాహెగ్డే కనిపించనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. చిరు - చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక రెండు పార్టులుగా రానున్న 'పుష్ప' చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ ఇందులో పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ గా కనిపిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ ఎర్నేని - వై. రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.