Begin typing your search above and press return to search.
పిక్ టాక్: ఆయుధమైనా అమ్మాయైనా సిద్ధ చేతిలో ఒదిగిపోవాల్సిందే..!
By: Tupaki Desk | 13 April 2021 6:56 AM GMTకొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''ఆచార్య''. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కామ్రేడ్ సిద్ధ గా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. చరణ్ కి జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు - 'లాహే లాహే' సాంగ్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో నేడు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్త పోస్టర్ ని విడుదల చేశారు.
చరణ్ - పూజాహెగ్డే లకు సంబంధించిన ఈ పోస్టర్ ని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేస్తూ ''ఆయుధమైనా... అమ్మాయి అయినా... సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది'' అని పేర్కొన్నారు. ఈ రొమాంటిక్ పోస్టర్ లో చరణ్ పూజాహెగ్డేని దగ్గరకు తీసుకొని, కళ్లలో కళ్ళుపెట్టి చూసుకుంటున్నారు. కాగా, చిరు - చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో 'ఆచార్య' పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సామాజిక అంశానికి కమర్షియల్ హంగులు జోడించి కొరటాల శివ తనదైన శైలిలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు.
కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి 'ఆచార్య' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించగా.. సినిమాటోగ్రాఫర్ తిరు అద్భుతమైన విజువల్స్ అందించారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.