Begin typing your search above and press return to search.
ఆచార్యుడి కోసం రంగంలోకి ఏపీ సీఎం?
By: Tupaki Desk | 16 April 2022 9:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం `ఆచార్య`. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. చిరు సినిమా థియేటర్లలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు కావస్తుండటంతో ఈ చిత్రం కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చిరుతో కలిసి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించిన సినిమా కావడంతో ఈ మూవీపై భారీ స్థాయిలో బజ్ ఏర్పడింది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లపై నిరంజన్ రెడ్ది ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఏప్రిల్ 29న ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. `ట్రిపుల్ ఆర్` తరువాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం కోసం సర్వత్రా ఆసక్తిని నెలకొంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో చరణ్ పాత్రకు ప్రాధాన్యత నివ్వడంతో ఇందులో చిరు గెస్ట్ రోల్ చేస్తున్నారా? లేక చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నారా? అన్నది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. చరణ్ పాత్ర నిడివి సినిమాలో తక్కువే అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ట్రైలర్ ని చరణ్ నేపథ్యంలో కట్ చేయడంతో అభిమానుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది.
తాజాగా చరణ్ పాత్రకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. ముందు ఈ మూవీలో చరణ్ పాత్ర నిడివి 40 నిమిషాలు వుంటుందని తెలిసింది. అయితే తాజా వార్తల నేపథ్యంలో నిడివిని 25 నిమిషాలకు కుదించారని చెబుతున్నారు. సినిమా నిడివి కారణంగా దర్శకుడు ఈ నిర్ణయం తసీఉకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ధర్మస్థలి కి అండగా నిలిచే సిద్దా గా చరణ్ ఇందులో కనిపించబోతున్నారు. అతని పాత్ర ఎండ్ కావడంతో అక్కడి వారికి అండగా నిలవడం కోసం చిరు ఎంట్రీ ఇస్తున్నట్టుగా ట్రైలర్ లో స్పష్టం చేశారు.
ఇదిలా వుంటే ఈమూవీ రిలీజ్ టైమ్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రచార పర్వాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే `ఆచార్య` పబ్లిసిటీ కి ట్రైలర్ రిలీజ్ తో శ్రీకారం చుట్టిన మేకర్స్ సినిమా రిలీజ్ మరో రెండు వారాలు వుండటంతో ప్రమోషనల్ ఈవెంట్ ల జోరు పెంచబోతున్నారట. ఇందులో భాగంగా విజయవాడలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 23న భారీ స్థాయిలో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, ఇందు కోసం ఛీఫ్ గెస్ట్ గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఆహ్వానించబోతున్నారని చెబుతున్నారు. ఇటీవల పెద్ద చిత్రాల టికెట్ రేట్ల కు సంబంధించిన చిరంజీవి ప్రత్యేకంగా వెళ్లి వైఎస్ జగన్ ని కలవడం.. ఆయన సానుకూలంగా స్పందించడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తన సినిమా ఈవెంట్ కి జగన్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని మెగాస్టార్ తో పాటు మేకర్స్ భావిస్తున్నారట. ఇందులో భాగంగానే `ఆచార్య` ప్రీ రిలీజ్ ఈవెంట్ ని విజయవాడలో ఈ నెల 23న భారీ స్థాయిలో నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆచార్యుడి కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంగంలోకి దిగుతారో లేదో చూడాలి.