Begin typing your search above and press return to search.
ఆచార్య విడుదలతేదీ ఖరారు.. వేసవిలో మెగాస్టార్ సింహగర్జన!!
By: Tupaki Desk | 29 Jan 2021 2:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా గురించి వెయిట్ అయిపోయింది. మెగాస్టార్ 152వ సినిమాగా తెరకెక్కుతున్న ఆచార్య పై రోజురోజుకి అంచనాలు భారీగా పెరుగుతూ వచ్చాయి. ఈ సినిమాను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లపై నిరంజన్ రెడ్డి, రాంచరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు ఆచార్య అనే పేరును ప్రకటించినప్పటి నుండి సినిమా పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తయిందట. అయితే ఇంతకాలం అభిమానులు ఎదురుచూస్తున్న అప్డేట్స్ అన్ని ఒక్కసారిగా ప్రకటించి సర్ప్రైజ్ చేసారు ఆచార్య మేకర్స్. తాజాగా ఆచార్య టీజర్ విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ చూస్తుంటే మెగాస్టార్ ఈ సినిమాలో బలమైన క్యారెక్టర్ పోషించినట్లు తెలుస్తుంది.
దేవాలయాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. అలాగే టీజర్ తో పాటు విడుదల తేదీని ప్రకటించారు. ఈ ఏడాది వేసవి కానుకగా మే 13న ఆచార్య సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. ఈ వార్తతో మెగాస్టార్ అభిమానులలో సందడి మొదలైంది. ఈ సినిమాలో సామాజిక అంశాలతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి కొరటాల తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. అంతేగాక ఈ సినిమాలో రాంచరణ్ కీలకపాత్రలో కనిపించనుండగా.. రాంచరణ్ కు జోడిగా పూజాహెగ్డే నటిస్తోంది. ఇదివరకే డైరెక్టర్ కొరటాలను చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతుందని అడిగితే.. ఆచార్యలో మెగాస్టార్ కోసం స్ట్రాంగ్ క్యారెక్టర్ రాసాను. చిరు క్యారెక్టర్ శత్రువులకు చెమటలు పట్టించే విధంగా డిజైన్ చేసానని.. అలాగే బాగా ఎమోషన్స్ తో కూడిన బలమైన డైలాగ్స్ రాశానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ సినిమాలో చిరంజీవి సింహగర్జన వినిపిస్తానని అంటున్నారు కొరటాల. చూడాలి మరి మెగాస్టార్ ఆచార్యతో పాఠాలు ఎలా చెబుతాడో!