Begin typing your search above and press return to search.
ఆగస్టులోనే ఆచార్య రిలీజ్ .. ఇదీ ప్రూఫ్!
By: Tupaki Desk | 26 April 2021 7:36 AM GMTమెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం ఆచార్య ఆగస్టులో రిలీజవుతుందని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే చిత్రబృందం నుంచి అధికారికంగా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా రాలేదు.
కానీ ట్రేడ్ వర్గాల ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం ఈ సినిమాని ఆగస్టులో రిలీజ్ చేసే ఆలోచన ఉందని కొరటాల పంపిణీ వర్గాలకు సమాచారం ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మే 14 న రావాల్సిన ఈ సినిమాకి కోవిడ్ పెద్ద ఆటంకంగా మారింది.
నిజానికి కోవిడ్ కష్ట కాలంలోనే ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. అది ప్రతిసారీ వాయిదాకు కారణమవుతోంది. ఇప్పటికే మొదటి వేవ్ లో షూటింగులకు ఆటంకం తప్పలేదు. ఇప్పుడు సెకండ్ వేవ్ తో ఇబ్బంది తలెత్తింది. కారణం ఏదైనా కానీ మే నుంచి ఆగస్టు వరకూ ఆచార్య వాయిదా పడుతోంది. ఆ మేరకు కొరటాల నుంచి స్పష్ఠమైన ఆదేశాలు అందాయని పంపిణీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మెజారిటీ భాగం మూసేసారు. తెరిచి ఉంచిన వాటికి జనం రావడం లేదు. ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభించాక కానీ ఏదీ కొరటాలకు క్లారిటీ రాకపోవచ్చు. మే నెలాఖరులో మేకర్స్ అధికారిక తేదీని ప్రకటిస్తారు. ఆచార్య కోసం గత రెండేళ్లుగా కొరటాల సహా చిత్రబృందం పని చేస్తూనే ఉంది.
మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ నిరంజన్ రెడ్డి తో కలిసి చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ 20 నిమిషాల నిడివి ఉన్న అతిథి పాత్రను పోషిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్.. చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.