Begin typing your search above and press return to search.
'ఆచార్య' ను పాన్ ఇండియా వైడ్ ప్లాన్ చేస్తున్నారా..?
By: Tupaki Desk | 23 Dec 2021 7:30 AM GMTమెగా తండ్రీకొడుకులు చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ''ఆచార్య''. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతేడాది సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కరోనా పాండమిక్ నేపథ్యంలో వాయిదా పడింది. చివరగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
అయితే 'ఆచార్య' చెప్పిన సమయానికి వచ్చే అవకాశం లేదంటూ సోషల్ మీడియాలో అనేక రూమర్లు వచ్చాయి. మేకర్స్ మాత్రం ముందుగా నిర్ణయించిన తేదీకే సినిమాని విడుదల చేస్తామని చెబుతున్నారు.
రిలీజ్ డేట్ పై నిర్మాతలు ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ఈ మెగా మూవీ అనుకున్నట్లుగా ఫిబ్రవరి 4న విడుదలయ్యే అవకాశాలు తక్కువే అనే కామెంట్స్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఈ చిత్రాన్ని మల్టీలాంగ్వేజ్ లలో రిలీజ్ చేయాలని భావించడమే అని అంటున్నారు.
'ఆచార్య' చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ విడుదల చేయడానికి నిర్మాతల్లో ఒకరైన రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే చిరంజీవి చేసిన 'సైరా నరసింహా రెడ్డి' మూవీని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో చెర్రీకి ఎలాగూ నేషనల్ వైడ్ పాపులారిటీ వస్తుంది. అందుకే ఇప్పుడు మెగా వారసుడు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారట.
నిజానికి అప్పట్లో 'సైరా' సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేయడానికి చిరుకి అన్నకున్నంత టైమ్ దొరకలేదు. ఇప్పుడు 'ఆచార్య' సినిమా విషయంలో మాత్రం అలాంటి మిస్టేక్ చేయకూడదనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగా ఏప్రిల్ 1న 'సర్కారు వారి పాట' విడుదల కాకుంటే.. ఆ తేదీకి 'ఆచార్య' సినిమాను తీసుకురావాలని అనుకుంటున్నారట.
అలానే ఫిబ్రవరి 4వ తేదీనే పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసే సాధ్యాసాధ్యాల గురించి డిస్కస్ చేస్తున్నారట. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. కాగా, దేవాదాయ శాఖకు సంబంధించిన కథాంశంగా 'ఆచార్య' చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో చిరంజీవి - రామ్ చరణ్ నక్సలైట్లుగా కూడా కనిపించనున్నారు. చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తే.. చరణ్ కు జోడీగా పూజాహెగ్డే సందడి చేయనుంది.
ఇప్పటికే 'ఆచార్య' చిత్రం నుంచి విడుదలైన స్పెషల్ పోస్టర్స్ - టీజర్ - సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. తిరు సినిమాటోగ్రఫీ అందించగా.. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.