Begin typing your search above and press return to search.
#ఆచార్య.. ముఖంపై చెప్పలేనివి షాకిచ్చేవి..!
By: Tupaki Desk | 17 Jan 2021 4:31 AM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకుడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. లాక్ డౌన్ లో విరామం వచ్చినా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు. దేవాలయ శాఖ కుంభకోణాలు రాజకీయాల నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్ కి గురి చేసే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది.
ఈ మూవీకి సంబంధించిన రకరకాల విషయాలపై సంగీత దర్శకుడు మణిశర్మ ఓపెనయ్యారు. చిరంజీవితో చాలా కాలం తరువాత.. పనిచేస్తున్నందుకు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే దర్శకుడు కొరటాలతో పనిచేయడం చాలా సులభమని ఆయన అన్నారు. ఎందుకంటే కొరటాల చాలా జాగ్రత్తపరుడు. ఏదైనా ముఖాముఖి చెప్పడానికి సంకోచించాల్సి వస్తే.. దానిని సినిమాలో సందేశం ఇవ్వడం ద్వారా చెబుతాడని ప్రశంసించారు. ఆచార్యలో చాలా ఆశ్చర్యకరమైన అంశాలు ఉంటాయని మణిశర్మ చెప్పారు.
చిరుతో పాటు విక్టరీ వెంకటేష్ తోనూ ఏకకాలంలో పని చేస్తున్నారు మణిశర్మ. వెంకీ నటిస్తున్న `నారప్ప` చిత్రానికి ఆయన సంగీతం అందిస్తున్న సంగతి తెలిసినదే. చాలా కాలం తర్వాత ఇద్దరు అగ్ర హీరోల కోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా పని చేస్తున్నారు ఆయన. ఇక ఈ రెండు సినిమాల బీజీఎం- రీరికార్డింగ్ యూనిక్ గా ఉండేలా మణిశర్మ మ్యాజిక్ చేయనున్నారని తెలుస్తోంది. ఆర్.ఆర్ మాంత్రికుడిగా అతడికి ఉన్న ప్రత్యేకతను ఈ రెండు సినిమాల్లోనూ మరోమారు తెలుగు జనం చూస్తారని తెలుస్తోంది.