Begin typing your search above and press return to search.
ఆచార్య (Vs) పుష్ప (Vs) RRR .. ఏం జరుగుతోంది?
By: Tupaki Desk | 27 Aug 2021 10:41 AM GMTమెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తొలిగా కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` విడుదలకు సిద్ధమవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కానుంది.
సంక్రాంతి 2022 కి ఆచార్యను విడుదల చేయాలని భావిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. అయితే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్లాన్ మారిందని 2022 సంక్రాంతికి విడుదల చేసేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నారని అందువల్ల అంతకుముందే ఆచార్యను రిలీజ్ చేయాలని యోచిస్తున్నట్టు తాజాగా గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.
ప్రోగ్రెస్ ప్రకారం.. ఆచార్య సినిమాలోని రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉంది. తాజా సమాచారం మేరకు.. ఈ సంవత్సరం క్రిస్మస్ కి విడుదల చేయనున్నారని తెలుస్తోంది. విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అక్టోబర్ లో ఆచార్య పెండింగ్ చిత్రీకరణ కోసం చరణ్ తన కాల్షీట్లను కేటాయిస్తారు. అక్టోబర్ చివరి నాటికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈలోగానే శంకర్ తో ఆర్.సి 15 చిత్రీకరణలో చరణ్ బిజీ అవుతున్నారు. ఈ వారంలోనే ఆర్.సి 15 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
ఆర్.ఆర్.ఆర్ వర్సెస్ భీమ్లా నాయక్?
నిజానికి సంక్రాంతికి ఆచార్య వస్తాడని.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వాయిదా వేస్తారని కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే సంక్రాంతి - 12 జనవరి తేదీన రిలీజవుతున్న పవన్ భీమ్లా నాయక్ ప్రణాళికలను చిరు డిస్ట్రబ్ చేసేందుకు ఆస్కారం లేదని ఒక సెక్షన్ విశ్లేషిస్తోంది.
అందుకే ఎట్టి పరిస్థితిలో `ఆచార్య`ను క్రిస్మస్ 2021 కి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆచార్య వస్తే పుష్ప పరిస్థితేమిటి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ చిరంజీవి కోసం త్యాగం చేయాల్సి వస్తే `పుష్ప: రైజ్ పార్ట్ -1` సమ్మర్ 2022 కి వాయిదా వేయాల్సి ఉంటుంది. చిరు - కొరటాల ఇద్దరూ మైత్రి మూవీ మేకర్స్ తో గొప్ప అనుబంధం కలిగి ఉన్నారు. అందుకే క్రిస్మస్ రిలీజ్ కి మైత్రి సంస్థ లైన్ క్లియర్ చేస్తుంది. ఇక మావయ్య అడగాలే కానీ బన్నీ కాదనే ప్రసక్తే లేదు. అందుకే ఇప్పుడు పుష్ప రిలీజ్ 2022 సమ్మర్ కి వెళుతుందా? అన్నది సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా .. ఆచార్య.. పుష్ప రిలీజ్ తేదీలపై నిర్మాణ సంస్థల నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఆర్.ఆర్.ఆర్ కొత్త రిలీజ్ తేదీని ఇప్పటివరకూ ప్రకటించలేదు. ఇంకా దసరా అనే కొందరు అభిమానులు భావిస్తున్నారు. కానీ వాయిదా పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రిలీజ్ సంక్రాంతికా లేక సమ్మర్ లోనా? అన్నదానిపైనా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
ఆర్.ఆర్.ఆర్ - పుష్ప చిత్రాలు పాన్ ఇండియా మార్కెట్లో అత్యంత భారీగా రిలీజ్ కానున్నాయి. సైరా తర్వాత మెగాస్టార్ నటించిన సినిమాగా ఆచార్యకు హిందీ మార్కెట్లో డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆచార్య అత్యంత భారీగానే రిలీజ్ కానుంది. ప్రతి ఒక్కరూ రిలీజ్ తేదీని వీరంతా సెంటిమెంటుగా భావిస్తున్నారు. దీనికి తోడు ఈ మూడు చిత్రాల్లోనూ బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారు. ఇరుగు పొరుగు భాషలకు చెందిన నటీనటులను ఎంపిక చేసారు. ప్రమోషన్స్ పరంగానూ జాతీయ స్థాయిలో టాలీవుడ్ హవా కొనసాగుతోంది. అందుకే రిలీజ్ తేదీ అత్యంత కీలకంగా మారింది.