Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: అక్షర హాసన్ ఏం చెప్పాలనుకుంటోంది
By: Tupaki Desk | 21 March 2022 1:39 PM GMTవిశ్వనటుడు కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ ఇంకా కెరీర్ నిలదొక్కుకోలేదు. ప్రయత్నాలు చేస్తున్నా సరైన ఫలితాలు రాడం లేదు. బాలీవుడ్ లో `షమితాబ్` తో ఎంట్రీ ఇచ్చిన అక్షర్ అటుపై మూడు..నాలుగు సినిమాల్లో నటించింది. కానీ సక్సెస్ ల పరంగా వెనుకబడే ఉంది. ప్రస్తుతం `అగ్ని సిరగుగల్`..`అచ్చం మేడమ్ నానం పయిర్పు` చిత్రాల్లో నటిస్తోంది.
తాజాగా `అచ్చం మేడమ్ నానం పయిర్పు` ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా..ఎంటర్ టైన్ మెంట్ గా సాగుతుంది. అక్షర డీసెంట్ గాళ్. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. స్నేహితుల మధ్య శృంగారం అనే టాపిక్ రాగానే తెలివిగా ప్రవర్తిస్తుంది. వయసుకి నిషిద్దం అని భావించే పనులు చేయడానికి బయలుదేరినట్లు ట్రైలర్ లో ఓ సన్నివేశంలో హైలైట్ చేసారు. ఇక్కడ ఓ అమ్మాయి రోజువారిలో కలిగే శృంగార కోరికల్ని క్యాప్చర్ చేసినట్లు కనిపిస్తుంది.
వృద్దులు యుక్తవయస్కులను పాపా అని ఎలా పిలిస్తే! ఆ సమయంలో అమ్మాయి అవసరాల్ని వ్యక్తపరచడం ఎంత కష్టమవుతుందో ట్రైలర్ లో ఫన్నీగా చూపించారు. `అచ్చం మేడమ్ నానం పయిర్పు` అంటే భయం..అమాయకత్వం.. హుందాతనం..పవిత్రత) అని అర్ధం. సరిగ్గా ట్రలర్ లో అవే పాయింట్లని రివీల్ చేసారు. చక్కని సందేశాత్మక చిత్రంలో కనిపిస్తుంది. ఎమోషన్ చక్కగా క్యారీ అయింది. బీజీఎమ్ ఆద్యంతం ఇంటెన్స్ మోడ్ లో అలరించింది.
ఈ సినిమా రిలీజ్ కి ముందే సంచలనాలు నమోదు చేస్తోంది. సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. బోస్టన్ లోని కాలిడోస్కోప్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్.. చికాగో సౌత్ ఏషియన్ ఫెస్టివల్.. అట్లాంటా ఇండియిన్ ఫెస్టివల్.. సియాటాలోని తస్వీర్ సౌత్ ఏషియన్ ఫిల్మ్ పెస్టివల్..మొజాయిక్ ఇంటర్నేషనల్ పెస్టివల్స్ సహా అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో సినిమా ప్రదర్శింపబడింది. ఆ రకంగా సినిమాకి ముందుగానే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.
ఈ సినిమా కథ విషయానకి వస్తే.. ఒక యువతి తన కోరికల్ని కుటుంబ ఒత్తిళ్ల మధ్య ఎలా బ్యాలెన్స్ చేయగల్గింది అనే పాయింట్ తో రాజా రామమూర్తి తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్ లో సినిమా విడుదల కానుంది.