Begin typing your search above and press return to search.

అక్కడమ్మాయ్‌.. అందుకే వదిలేసింది

By:  Tupaki Desk   |   4 Jan 2016 4:35 AM GMT
అక్కడమ్మాయ్‌.. అందుకే వదిలేసింది
X
అక్కినేని వంశం నుంచి ఓ హీరోయిన్ వెండితెర‌పై మెరిసిన సంగ‌తిని అటు అక్కినేని అభిమానులు కానీ, ఇటు మెగాభిమానులు కానీ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఏఎన్నార్ మ‌న‌వ‌రాలు, అక్కినేని నాగార్జున మేన‌కోడ‌లు, సుమంత్ కి అక్క అయిన సుప్రియ . మెగాబ్ర‌ద‌ర్ ప‌వ‌న్‌ కళ్యాణ్ స‌ర‌స‌న ''అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి'' సినిమాతో హీరోయిన్‌ గా ప‌రిచ‌య‌మైంది. అయితే ఆ త‌ర్వాత ఎందుక‌నో న‌ట‌న వైపు చూసిందే లేదు.

ఇకపోతే దానికి కార‌ణ‌మేంటో స్ప‌ష్టంగా ఇంత‌కాలానికి చెప్పేసింది సుప్రియ‌. మొద‌టి ప్ర‌య‌త్న‌మే ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టించాను. కానీ అస‌లు న‌ట‌న అనేది నాకు స‌రిప‌డేది కాదు అని మొద‌టి సినిమాతోనే తెలిసిపోయింది. ఇది నా ఒంటికి స‌రిప‌డ‌దు. నేను సూట్ కాను అనుకున్నా. అందుకే ఆ రంగాన్ని వ‌దిలేశా. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోస్‌ కి సంబంధించిన ప‌నుల‌న్నీ చూసుకుంటున్నా. .. అని చెప్పారు. ఈ స్టూడియో నిర్మించే సినిమాల కోసం ఆన్‌ సెట్స్ వెళ్లిన‌ప్పుడు... పాప ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చూస్తుంద‌ట! అంటూ అవ‌హేళ‌న‌గా మాట్లాడారు. కానీ వాటిని ప‌ట్టించుకోకుండా నా ప‌నిలో నేను ఇన్వాల్వ్ అయిపోయాను. ప్రొడక్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌ గా - ప్రొడ‌క్ష‌న్ డైరెక్ట‌ర్‌ గా అనుభ‌వం ఘ‌డించాను. ఒక సినిమా ప్రారంభం నుంచి ముగింపు వ‌ర‌కూ ప్ర‌తిదీ ఏం కావాలో తెలుసు ఇప్పుడు... అంటూ సుప్రియ చెప్పుకొచ్చారు.

క‌థానాయిక గా కంటే ఇప్పుడు ఎక్కువ సంతృప్తిగా ఉన్నార‌న్న సంగ‌తి మాక్కూడా అర్థ‌మైంది మ్యాడ‌మ్‌!