Begin typing your search above and press return to search.
ఆఫీసర్ టైమ్ అంతేనట
By: Tupaki Desk | 6 March 2018 5:05 PM GMTగత కొంత కాలంగా సౌత్ సినిమాల నిడివి చాలా వరకు తగ్గుతూ వస్తోంది. ఎలాంటి కథ అయినా ఎడిటింగ్ కి పెద్ద పనే పెడుతోంది. మొత్తానికి సినిమా నిడివి సమయం రెండు గంటల కంటే ఎక్కువగా ఉండడం లేదు. ప్రతి దర్శకుడు కూడా ఇప్పుడు ఎక్కువగా రిస్క్ తీసుకోవడం లేదు. అనవసర సన్నివేశాలను వీలైనంత వరకు కట్ చేస్తున్నారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా అదే చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వర్మ నాగార్జున తో ఆఫీసర్ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే సినిమాలో ఎక్కువగా ఎడిటింగ్ లో లేపేసే సీన్స్ ఏమి లేవట. కొన్ని షాట్స్ మాత్రమే తీసేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా నిడివి 100 నిమిషాలు ఉంటుందట. అంటే గంట 40 నిమిషాలు. ఈ సమయం నిజంగా చాలా తక్కువ అని కాదు అలా అని ఎక్కువ కాదు. సాంగ్స్ వంటివి ఏమి లేవు. దీంతో నిడివి సమయం అందులోనే సేవ్ అయ్యింది. ఎక్కువ తక్కువ కాకుండా మధ్యలో రన్ టైమ్ కుదరడం సినిమాకు కలిసొచ్చే అంశం. పూర్తిగా పోలీస్ ఆఫీసర్ నేపథ్యంలో సాగే ఈ కథలో స్క్రీన్ ప్లే హైలెట్ గా నిలుస్తుందట.
చాలా వరకు సినిమాలో నాగ్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయట. చాలా రోజుల తరువాత వర్మ డిఫెరెంట్ యాంగిల్ లో సినిమా చేస్తున్నాడు. కొత్త అమ్మాయి మైరా సరెన్ ఆఫీసర్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో సరికొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ముంబైలో క్లైమాక్స్ దశలో ఉన్న షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి మే 25న రిలీజ్ చేయడానికి వర్మ ప్లాన్ చేస్తున్నాడు.