Begin typing your search above and press return to search.
యాక్షన్ ఓకే.. బట్ రొమాన్స్ మిస్సవుతున్నారే
By: Tupaki Desk | 23 April 2022 12:30 AM GMTస్టార్ హీరోలకు అదిరిపోయే ఎలివేషన్ లు ఇవ్వడంలో దిట్టలు..యాక్షన్ ఘట్టాలతో హాలీవుడ్ డైరెక్టర్లనే అబ్బురపరిచే డైరెక్టర్లు..మాస్ ఆడియన్స్ చేత థియేటర్లు మారుమోగే స్థాయిలో విజిల్స్ వేచించడంలోనూ.. మాస్ ఆడియన్స్ ని రోమాంచితుల్ని చేయడం లోనూ వారికి వారే సాటి.. వాళ్ల సినిమా వచ్చిందంటే థియేటర్ల వద్ద మాస్ జాతర మోత మోగాల్సిందే. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లని అందించడంలో మాస్టర్ లు అనడం కంటే తోపులు అనడం కరెక్ట్. కానీ ఒక్క విషయంలో మాత్రం తడబడుతున్నారు. యాక్షన్ ఘట్టాలని ఓరేంజ్ లో తెరపై ఆవిష్కరించి ఆడియన్స్ విజిల్స్ వేచిస్తున్న వీరు ఒక్క విషయంలో మాత్రం వెనకబడిపోతుండటం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.
రాజమౌళి పుణ్యమా అని భారతీయ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఏ దర్శకుడిని కదిలించినా ఇప్పడు వినిపిస్తున్న ఒకే ఒక్క మాట పాన్ ఇండియా. దీంతో రొమాంటిక్ డ్రామాలని పక్కన పెట్టేసి ప్రతీ దర్శకుడు యాక్షన్ మంత్రం జపిస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్, బోయపాటి శ్రీను, వివి వినాయక్. యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచిని ఈ దర్శకులు ఒక్క విషయంలో మాత్రం తడబడుతున్నారు.
మరీ ప్రధానంగా యాక్షన్ చిత్రాలతో పాన్ ఇండియా డైరెక్టర్లు గా మారిన ఇద్దరు దర్శకులు ఎంత యాక్షన్ ఘట్టాలతో తోపులు అనిపించుకుంటున్నా ఒక్క విషయంలో మాత్రం ఉసూరుమనిపిస్తున్నారు. ఆ దర్శకులు మరెవరో కాదు రాజమౌళి, ప్రశాంత్ నీల్. యాక్షన్ చిత్రాలతో ఈ మధ్య కాలంలో ఈ ఇద్దరు దర్శకులు పాన్ ఇండియా వైడ్ గా కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేశారు. దేశ వ్యాప్తంగా వున్న స్టార్ డైరెక్టర్లు తమ సినిమాలతో వణుకు పుట్టిస్తూ కొత్త టార్గెట్ లని సెట్ చేసిన ఈ డైరెక్టర్లు రొమాంటిక్ సీన్ ల విషయంలో మాత్రం చాలా వెనకబడే వుండటం గమనార్హం.
విక్రమార్కుడు, ఛత్రపతి వంటి చిత్రాల్లో హీరోయిన్ మధ్య రొమాన్స్ ని పండించిన రాజమౌళి ఆ తరువాత సీరియస్ పంథాని పాటిస్తూ బాహుబలి` నుంచి రొమాంటిక్ ట్రాక్ ని పక్కన పెట్టి యాక్షన్ మంత్రం జపిస్తున్నారు. రెండవ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా టార్గెట్ ని రీచ్ అయిన ప్రశాంత్ నీల్ కూడా యాక్షన్ మంత్రాన్నే జపిస్తున్నాడు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో పాన్ ఇండియా వైడ్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ మూవీస్ లో హీరో యష్ కి ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ లు.. పీక్స్ స్టేజ్ లో డిజైన్ చేసిన యాక్షన్ ఘట్టాలు ప్రస్తుతం సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేలా చేస్తున్నాయి.
అయితే మాస్ ఎలివేషన్స్ ని ఓ రేంజ్ లో క్రియేట్ చేసే ఈ దర్శకుడు రొమాంటిక్ సీన్ లని మాత్రం డీల్ చేయలేకపోతున్నాడట. ఇదే విషయాన్ని ఇటీవల ప్రశాంత్ నీల్ ని అడిగితే అలాంటి సీన్ లు చేయడం తనకు రాదని నిర్మొహమాటంగా చెప్పేశాడు. ఇదే సమస్య ఈ ఇద్దరు దర్శకులకే కాదు బోయపాటి శ్రీను, వి.వి.వినాయక్ లకు కూడా వుంది. అయితే యాక్షన్ ని, రొమాంటిక్ సన్నివేశాలని ఒకే తరహాలో తెరపై సమపాళ్లలో ఆవిష్కరించడంలో మాత్రం సుకుమార్ సక్సెస్ అవుతున్నారు.
ఇటీవల ఆయన తెరకెక్కించిన `పుష్ప`లో యాక్షన్ ఘట్టాలకు ఎంత ప్రాధాన్యత వుందో బన్నీ - రష్మికల మధ్య షూట్ చేసిన రొమాంటిక్ ఘట్టాలకు కూడా అంతే ప్రాధాన్యత వుండటం విశేషం. ఈ విషయంలో రాజమౌళి, ప్రశాంత్ నీల్ లని సుక్కు ఓవర్ టేక్ చేయడం గమనార్హం.