Begin typing your search above and press return to search.
కొత్త సినిమాలు రిలీజ్ చేయకూడదని నిర్ణయించిన ప్రొడ్యూసర్స్ గిల్డ్..?
By: Tupaki Desk | 12 Dec 2020 8:40 AM GMTకరోనా సంక్షోభం కారణంగా గత కొన్ని నెలలుగా థియేటర్ ఓనర్స్ - ఎగ్జిబిటర్స్ - డిస్ట్రిబ్యూటర్స్ తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోడానికి కేంద్రం అనుమతి ఇవ్వడంతో పాక్షికంగా థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాయి. కొన్ని పాత సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో కొన్ని క్రేజీ మూవీస్ కూడా క్రిష్మస్ మరియు సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో త్వరలో సినిమా సందడి ప్రారంభం కానుందని అందరూ అనుకున్నారు. అయితే సినీ వర్గాల తాజా సమాచారం ప్రకారం యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ మరియు ఎగ్జిబిటర్లకు మధ్య ఉన్న సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఏ సినిమా కూడా రిలీజ్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారట.
కేంద్రం థియేటర్స్ కి అనుమతి ఇచ్చిన వెంటనే గిల్డ్ మరియు ఎగ్జిబిటర్స్ మధ్య జరిగిన సమావేశాల్లో పలు అంశాలు చర్చకు వచ్చాయట. వారి మధ్య ఎప్పటి నుంచో వర్చువల్ ప్రాసెసింగ్ చార్జెస్ మరియు రెవెన్యూ షేరింగ్ విధానం.. తెలుగు సినిమాలకు తొలి ప్రాధాన్యత.. థియేటర్స్ లో ట్రైలర్స్ ప్రసారం చేసినందుకు అదనపు చార్జెస్ వంటి అంశాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సినిమాలను విడుదల చేయకూడదని గిల్డ్ నిర్ణయించిందట. అయితే ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమాలు రిలీజ్ అయ్యే సమయానికి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయేమో చూడాలి.