Begin typing your search above and press return to search.

డబ్బులు లేక హోటల్ లో గిన్నెలు కడిగా.. నటుడు అజయ్ కామెంట్స్ వైరల్

By:  Tupaki Desk   |   15 Oct 2022 12:39 PM GMT
డబ్బులు లేక హోటల్ లో గిన్నెలు కడిగా.. నటుడు అజయ్ కామెంట్స్ వైరల్
X
విక్రమార్కుడిలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి.. అనంతరం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా కూడా చేసిన నటుడు అజయ్. చాలా రోజుల గ్యాప్ తర్వాత ‘9 అవర్స్’ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ద్వారా సినీ ప్రియులను పలకరించాడు. తన సినీ ప్రస్థానం, కష్టాల గురించి ఎమోషనల్ అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి.. తాను ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండడం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

దాదాపు 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న నటుడు అజయ్.. హీరోలతో సమానంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. విక్రమార్కుడు, ఒక్కడు, సై, దేశముదురు, ఇష్క్ వంటి అనేక చిత్రాల్లో నటించి మెప్పించాడు. అయితే కొద్దికాలంగా అజయ్ వెండితెరపై కనిపించడం లేదు. చేతినిండా సినిమాలో ఎప్పుడూ బిజిగా ఉండే అజయ్ సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నాడన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఈవెంట్స్ లోనూ అజయ్ కనిపించలేదు.

తాజాగా 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండడం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అజయ్ మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే నటించాను. గత 22 ఏళ్లుగా చేసింది కూడా అదే. ఇప్పుడూ అదే చేస్తున్నా.. సినిమాల్లో మన పాత్ర ఎంత సేపు ఉంది.? ఎన్ని సార్లు కనిపించింది అని కాకుండా ఎంత ప్రభావవంతంగా ఉందనేది పరిగణలోకి తీసుకుంటాను. ఇన్నాళ్లు ఎందుకు సినిమాలు చేయలేదంటే.. నాకు తగిన పాత్రలు దొరకలేదు. అందుకే మధ్యలో గ్యాప్ తీసుకున్నాను.. ’ అంటూ అసలు సంగతిని వివరించాడు.

ఇక తాను 19 ఏళ్ల వయసులోనే ఇంట్లోంచి నేపాల్ కు పారిపోయానని అజయ్ సంచలన విషయాలు పంచుకున్నాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చేందుకు నా దగ్గర డబ్బులు లేవని.. దీంతో హోటల్ లో గిన్నెలు కడిగి డబ్బులు వచ్చాక ఇంటికి వచ్చానంటూ ఎమోషనల్ అయ్యాడు. శ్రీమహాలక్ష్మీ సినిమాలో రేప్ సీన్ లో అమ్మాయి చేయి పట్టుకోగానే ఆ మోడల్ ఏడ్చేసిందని.. ఇక ఆ సీన్ చేయనని.. ఇప్పటివరకూ అలాంటి సన్నివేశాలు చేయనని చెప్పానని అజయ్ తెలిపారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.