Begin typing your search above and press return to search.

సౌత్ సినిమాని లైట్ అనలేక‌పోయిన‌ హిందీ స్టార్

By:  Tupaki Desk   |   22 May 2022 9:04 AM GMT
సౌత్ సినిమాని లైట్ అనలేక‌పోయిన‌ హిందీ స్టార్
X
బాలీవుడ్ ని కొట్టే సినిమాలు ఇప్పుడు సౌత్ లో తెర‌కెక్కుతున్నాయి. ముఖ్యంగా దేశంలోనే టాలీవుడ్ నంబ‌ర్ వ‌న్ స్థానానికి ఎగ‌బాకుతోంది. ఒక్కో పాన్ ఇండియా సినిమాతో స‌త్తా చాటుతూ హిందీ ఫిలింమేక‌ర్స్ కి స‌వాల్ గా మారుతోంది. దక్షిణాది సినిమాలు హిందీ సినిమాపై ఆధిపత్యం చెలాయించిన తీరు స్ప‌ష్ఠంగా కనిపిస్తుంది. కానీ హిందీ మీడియా దీనిపై హ్యాపీగా లేదు. దీనికి సంతోషించడం ఇష్టం లేక దక్షిణాది చిత్రాలను రీమేక్ చేస్తున్నందుకు హిందీ స్టార్ హీరోల‌పై దుమ్మెత్తి పోస్తోంది.

దాని గురించి అక్షయ్ కుమార్ ని ప్ర‌శ్నిస్తే.. ``ఏం సమస్య? ఓ మై గాడ్ .. నా సినిమా తెలుగులో రీమేక్ అయ్యి పెద్ద హిట్ అయింది. వారి విక్ర‌మార్కుడు సినిమాని `రౌడీ రాథోడ్`గా మేం రీమేక్ చేసి.. మా అందరి కోసం పనిచేశాము. ఎవరికైనా ఎందుకు సమస్య వ‌స్తోంది?`` అని అడిగారు. ఆస‌క్తిక‌రంగా ఇంత‌కుముందు ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 స‌క్సెస్ పై ఖిలాడీ న‌ర్మ‌గ‌ర్భంగా మాత్ర‌మే మాట్లాడ‌డంపై విమ‌ర్శ‌లొచ్చాయి. కానీ ఇంత‌లోనే అత‌డి స్వరం మారింది. ద‌క్షిణాది సినిమా గొప్ప‌త‌నంపై కొంతైనా అంగీక‌రించారు అతడు.

ప్ర‌స్తుతం ఖిలాడీ అక్ష‌య్ కుమార్ వ‌రుస‌గా మరో రెండు రీమేక్ లు చేస్తున్నారు. వీటిలో ఒక సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా న‌టిస్తోంది. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. అక్షయ్ తన కొత్త చిత్రం `పృథ్వీరాజ్` విడుదలకు కూడా సిద్ధమవుతున్నాడు.

పృథ్వీరాజ్ స్ఫూర్తి బాహుబ‌లి!

ఇప్పుడు అక్ష‌య్ - య‌ష్ రాజ్ బ్యాన‌ర్ కాంబినేష‌న్ లో ఓ భారీ జాన‌ప‌ద చిత్రం పృథ్వీరాజ్ విడుద‌లకు సిద్ధ‌మ‌వుతంది. ఈ మూవీ ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2- బాహుబ‌లి 2 త‌ర‌హాలోనే 1000 కోట్ల క్ల‌బ్ లో చేరుతుందా? అంటూ వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. బాలీవుడ్ ని ద‌శాబ్ధాల పాటు ఏలిన కిలాడీ కుమార్ ఇప్పుడు సౌత్ హీరోల‌తో పోటీపడి దూసుకెళ‌తాడా? అన్న విశ్లేషణ సాగుతోంది. కొన్నేళ్లుగా స్థిర‌మైన స‌క్సెస్ రేట్ తో ఉన్న అక్ష‌య్ ఇప్ప‌టివ‌ర‌కూ 500 కోట్ల క్ల‌బ్ లో లేడు. అత‌డు న‌టించిన సౌత్ సినిమా 2.0 మాత్ర‌మే అత‌డికి ఆ క్రెడిట్ ని ఇచ్చింది.

అక్షయ్ కుమార్ తదుపరి పృథ్వీరాజ్ అనే శక్తివంతమైన సామ్రాట్ గా క‌నిపించ‌బోతున్నారు. పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం పరాక్రమం ఆధారంగా రూపొందించిన చిత్ర‌మిది. అతను క్రూరమైన దండయాత్ర చేసిన మహమ్మద్ ఘోర్ కి వ్యతిరేకంగా నిలిచి ధైర్యంగా పోరాడిన యోధునిగా చ‌రిత్ర లిఖించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ - దర్శకుడు డా. చంద్రప్రకాష్ ద్వివేది ఈ చిత్రం మరో స్థాయిలో ఉండాల‌ని కోరుకున్నారు. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ జీవితానికి అత్యంత ప్రామాణికమైన తెర రూపం ఇవ్వాల‌ని కోరుకున్నారు. ఆదిత్య చోప్రా YRF ఈ మూవీ కోసం త‌మ భ‌వంతిలో మొత్తం అంతస్తును పృథ్వీరాజ్ కోసం పరిశోధన విభాగంగా మార్చినట్లు తెలుస్తోంది. మేము శక్తివంతమైన హిందూ యోధుని జీవితాన్ని ఆ కాలాన్ని అత్యంత ప్రామాణికమైన రీటెల్లింగ్ చేస్తున్నామని నిర్ధారించుకోవడానికి అవసరమైన ప్రతిదీ చేసామ‌ని ఖిలాడీ చెబుతున్నారు. భారీ త‌నం నిండిన చారిత్రాత్మక క‌థ‌ను ప్రయత్నించడానికి మొదటి దశ ఎల్లప్పుడూ పరిశోధన ముఖ్యం. మేము పూర్తిగా క్షుణ్ణంగా హిస్ట‌రీని తెలుసుకుని తెర రూపం ఖచ్చితమైనదిగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు.

చిత్రీకరణ ప్రారంభించే ముందు YRFలోకి అనేక పుస్తకాలు.. సూచనలుగా ఉపయోగించే వివిధ రకాల దుస్తులు- కవచం-ఆయుధాలు ప‌రిశీలించామ‌ని తెలిపారు. ఆదిత్య చోప్రా YRF కి చెందిన‌ మొత్తం అంతస్తును పృథ్వీరాజ్ కోసం పరిశోధన విభాగంగా మార్చారు. షూటింగ్ చివరి రోజు వరకు రీసెర్చ్ విభాగాన్ని స‌ద్వినియోగ చేసార‌ట‌. ఇప్పుడు సినిమా విడుద‌ల ముందు భారీ ప్రమోష‌న్స్ కి య‌ష్ రాజ్ సంస్థ తెర తీసింది.