Begin typing your search above and press return to search.
మోసపోయిన అర్జున్.. విలన్ గా ఎలా మారారు
By: Tupaki Desk | 27 May 2018 7:30 AM GMTతెలుగు - తమిళ - కన్నడ భాషల్లో తిరుగులేని స్టార్ గా వెలుగొంది దక్షిణాదిన విశేష ప్రేక్షకాదరణ పొందారు అర్జున్.. ఇటీవలే నా పేరు సూర్య సినిమాతో మరోసారి తెలుగులో తళక్కున మెరిసారు.. తాజాగా తమిళంలో రూపొందిన ‘ఇరంటు తిరై’ చిత్రంలో విలన్ గా చేశారు. ఆ చిత్రం అభిమన్యుడు పేరుతో తెలుగులోనూ విడుదలవుతోంది. ఇందులో హీరోగా విశాల్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తెలుగు మీడియాకు అర్జున్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.
అర్జున్ మాట్లాడుతూ.. అభిన్యుడు చిత్రంలో నేను చేసిన పాత్ర ఇంతవరకు చేయలేదు.. అది అసూయపడే రోల్.. 155పైగా చిత్రాల్లో నటించినా ఇంత ప్రత్యేకమైన రోల్ పోషించలేదు..17 ఏళ్ల క్రితం ద్రోహీలో డిఫెరెంట్ రోల్స్ చేశాను. కొత్తగా ఏదైనా చేద్దామనే ఈ రోల్ ట్రై చేశానని తెలిపారు..
అభిమన్యుడు సినిమా అవకాశాన్ని వదులుకొంటే జీవితంలో పెద్ద తప్పు చేసిన వాడిని అయ్యేవాడినని అర్జున్ తెలిపారు. ఇందులో గ్రే షేడ్ క్యారెక్టర్ ను మీరు ఎక్కడా చూసి ఉండరని వివరించారు. ఒకే ఒక్కడు, జైహింద్, జెంటిల్మన్ సినిమాలకు ఎంత పేరు వచ్చిందో.. ఈ సినిమాలో నటించినందుకు కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందని అర్జున్ చెప్పారు.
స్మార్ట్ ప్రపంచంలో తాను కూడా టెక్నాలజీతో మోసపోయానని.. ఐట్యూన్స్ లో 10 డాలర్లు పోయాయని అర్జున్ తెలిపారు. ఎవరిని అడుగుతాం.. ఎలా పోయాయో తెలియడం లేదు.. స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలో ఎంత లాభముందో అంతే మొత్తంలో మోసానికి గురయ్యే అవకాశాలున్నాయని ఆయన వాపోయారు. ఇక మోసపోవద్దనే నోకియా ఫీచర్ కీపాడ్ ఫోన్ కొనుక్కొని వాడుతున్నాను.
‘నా దగ్గర ఒకప్పుడు హీరో విశాల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. దాంతో నన్ను తన సినిమాలో విలన్ గా నటింపచేసేందుకు విశాల్ సంకోచించారు. దర్శకుడితో కథ చెప్పించారు.. అది నచ్చి ఒకే చెప్పాను. కానీ ఈ సినిమాను బాగా తీశారు. విశాల్ తో ఈజీగానే నటించాను..’ అంటూ విశాల్ తో నటించడంపై అర్జున్ వ్యాక్యానించారు.
అర్జున్... నా పేరు సూర్య చిత్రంపై కూడా మాట్లాడారు.. ‘నా పేరు సూర్య’లో తండ్రి పాత్ర చేయడానికి మొదట్లో నిరాకరించాను. కానీ దర్శక నిర్మాతలు ఒప్పించారు. ఇప్పుడు విలన్ గా చేస్తున్నా.. ఇందులో మీనింగ్ ఫుల్ విలన్ కావడంతోనే ఒప్పుకున్నానన్నారు.
చాలారోజుల క్రితమే సెంటిమెంట్ నేపథ్యంలో సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘రాణి రాణెమ్మ’ చిత్రాన్ని ప్రారంభించాం. కానీ ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని.. మళ్లీ త్వరలోనే ఆ సినిమా మొదలుకాబోతోందని అర్జున్ వివరించారు.
మూడు భాషల్లో నటించానని.. బాగా డబ్బు సంపాదించానని.. ఇల్లు ఫాంహౌస్ లున్నాయని అర్జున్ వివరించారు.. ఓ హనుమాన్ టెంపుల్ కట్టించానని.. ఇంతకంటే ఏం కావాలి అంటూ అర్జున్ తన మనోగతాన్ని వెల్లడించారు.