Begin typing your search above and press return to search.

శివుడున్నాడుగా.. శంకరుడెందుకు?

By:  Tupaki Desk   |   24 April 2018 4:44 AM GMT
శివుడున్నాడుగా.. శంకరుడెందుకు?
X
బలమైన కథకు సరైన ఎమోషన్స్ జోడించి కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం కోలీవుడ్ శంకర్ స్టయిల్. భారతీయుడు సినిమా నుంచి భారీ బడ్జెట్ సినిమాలకు శంకర్ ఫిక్సయిపోయాడు. శంకర్ డైరెక్షన్లో సినిమా వస్తోందంటే కోలీవుడ్ తోపాటు టాలీవుడ్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూసేది.

అలాంటిది ఇకపై టాలీవుడ్ కు శంకర్ అవసరం లేదనేశాడు యాక్టర్ బ్రహ్మాజీ. ఆయనకు దీటుగా కొరటాల శివ వచ్చాడని అంటున్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ హీరోగా నటించిన భరత్ అనే నేను రీసెంట్ గా రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ‘‘ఈ మూవీలో థియేటర్ ఫైట్.. అసెంబ్లీ సీన్లు చాలా బాగా వచ్చాయి. ఈ సినిమాలోని కొన్ని సీన్లు చూస్తే ఇంకెవరూ అలా చేయలేనరనిపించింది. అంత బాగా కొరటాల శివ తీశాడు. టాలీవుడ్ కు శంకర్ లాంటి డైరెక్టర్ అవసరం తీరిపోయింది అనిపించింది’’ అంటూ బ్రహ్మాజీ డైరెక్టర్ కొరటాల శివపై ప్రశంసలు కురిపించేశాడు.

తాను మొదటి నుంచి సూపర్ స్టార్ కృష్ణ అభిమాని అని.. ఏలూరులో ఫ్యాన్స్ క్లబ్ కు ప్రెసిడెంట్ ను కూడా అని బ్రహ్మాజీ చెప్పుకొచ్చాడు. కృష్ణను అంతగా అభిమానించే తాను ఆయన కొడుకు మహేష్ ను సినిమాలో నటిస్తానని అనుకోలేదని ఆనందపడిపోతున్నాడు. మొత్తానికి భరత్ అనే నేను హీరో డైరెక్టర్లకు బ్రహ్మాజీ ఓ రేంజిలో కాంప్లిమెంట్ ఇచ్చేశాడుగా..