Begin typing your search above and press return to search.

తమ్ముడు ధనుష్ తో అన్న పోటీ.. గెలిచేదెవరో?

By:  Tupaki Desk   |   13 Feb 2023 1:30 PM IST
తమ్ముడు ధనుష్ తో అన్న పోటీ.. గెలిచేదెవరో?
X
ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ లో ధనుష్ ఒకరు. స్టార్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న ఈయన భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు. హిందీ, తమిళ్, ఇంగ్లీష్ ఇలా ఏ భాషలో అయినా సినిమా చేసే ధనుష్ తన కెరీర్ లో మొదటిసారి తెలుగు-తమిళ భాషల్లో నటిస్తున్న బైలింగ్వల్ సినిమా 'వాతి' . తెలుగులో సార్ పేరుతో రిలీజ్ కానుంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సితార ఎంటర్తైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీలో ధనుష్ జూనియర్ లెక్చరర్ గా కనిపించనున్నారు. సాంగ్స్ తో, టీజర్, ట్రైలర్ తో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి.

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయంలో.. హిందీ నుంచి షెహజాదా రంగంలోకి దిగుతుంది. ఇది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ రిలీజ్ అయిన ఈ మూవీ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఉండదు కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఆ సమయంలో రావాల్సిన మాస్ కా దాస్ నటించిన దాస్ కా ధమ్కీ వాయిదా పడింది. గీత ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. మరోవైపు మార్వెల్ నుంచి యాంట్ మాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా సినిమా ఫిబ్రవరి 17నే ప్రేక్షకుల ముందుకి రానుంది. తెలుగులో సార్ సినిమా పై ఈ చిత్రాల ప్రభావం పడడు.

అయితే టాలీవుడ్ లో ధనుష్ సినిమా పరిస్థితి ఇలా ఉంటే కోలీవుడ్ లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ధనుష్ మూవీకి, తన అన్న సెల్వ రాఘవన్ హీరోగా నటిస్తున్న సినిమానే పోటీగా రానుంది. డైరెక్టర్ నుంచి యాక్టర్ గా మారిన సెల్వ రాఘవన్ ప్రస్తుతం బకాసురన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 17నే రిలీజ్ కానుంది. దీంతో ఒకే రోజున అన్నదమ్ముల సినిమాలు ఆడియన్స్ ముందుకి రానున్నాయి. అలా ఇద్దరు పోటీ పడనున్నారు. మరి సెల్వ రాఘవన్ తమ్ముడి కోసం వెనక్కి తగ్గి సోలో రిలీజ్ ఇస్తాడా ? లేక తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు పోటీకి దిగుతాడా అనేది చూడాలి. ఒకవేళ బరిలోకి దిగితే ఇద్దరిలో ఎవరు గెలుస్తారు మరి..