Begin typing your search above and press return to search.
సెన్సిబుల్ డైరెక్టర్ కు ధనుష్ షాకిచ్చినట్టేనా?
By: Tupaki Desk | 24 Dec 2021 1:30 AM GMT`ఫిదా`తో బ్లాక్ బస్టర్ అందుకోవడానికి శేఖర్ కమ్ములకు మూడేళ్లు పట్టింది. అంతుకు ముందు `అనామిక`తో ఫ్లాపుని చూసిన శేఖర్ కమ్ముల దాదాపు మూడేళ్ల విరామం తరువాత `ఫిదా` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ఆయన కెరీర్‌కి కొత్త ఊపిరులూదడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని సాధించి శేఖర్ కమ్ముల సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. అయితే ఈ సినిమా తరువాత శేఖర్ మరో సినిమాకు మళ్లీ మూడేళ్ల సమయం తీసుకోవాల్సి వచ్చింది.
`లవ్ స్టోరీ` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నాగచైతన్య, సాయి పల్లవి జోడీగా నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి `ఫిదా` మ్యాజిక్ ని రిపీట్ చేసింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వున్న శేఖర్ కమ్ముల ఈ మూవీ తరువాత ఏకంగా త్రిభాషా చిత్రంపై కన్నేశారు. తమిళ హీరో ధనుష్ తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీని తీయాలని ప్లాన్ చేశారు. ఈ చిత్రాన్ని`లవ్ స్టోరీ` ప్రొడ్యూసర్స్ ఏషియన్ మూవీస్ ప్రొడ్యూసర్స్ నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించాలని ప్లాన్ చేశారు.
జూన్‌లో ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా ప్రకటించారు. ధనుష్ హైదరాబాద్ వచ్చి టీమ్‌ని కలిశారు. నిర్మాతలతో చర్చలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫొటోలని కూడా మేకర్స్ మీడియాకు విడుదల చేసి హల్ చల్ చేశారు కూడా. కానీ ఆ తరువాత ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇదిలా వుంటే హీరో ధనుష్ తెలుగులో తన స్ట్రెయిట్ చిత్రం ఇదే అంటూ ప్రకటించి షాకిచ్చాడు.
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో ధనుష్ ఓ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలని నిజం చేస్తూ ధనుష్ తనతో చేస్తున్న ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. పైగా తెలుగులో ఇదే తన తొలి చిత్రమని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. `రంగ్ దే` మూవీని నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్య దేవర నాగవంశీ .. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వైఫ్ సాయి సౌజన్యతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టుగా గురువారం ప్రకటించారు.
`సార్` పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో ధనుష్ తో శేఖర్ కమ్ముల చేయాలని ప్లాన్ చేసిన సినిమా వెనక్కి వెళ్లినట్టేనని క్లారిటీ వచ్చేసింది. టైటిల్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయడంతో ముందు ఈ సినిమాలో పట్టాలెక్కబోతోందని స్పష్టమైంది. తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని త్వరలో నే స్టార్ట్ చేసి వచ్చే ఏడాది ప్రధమార్థంలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
`సార్` ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ టీజర్ లో టీమ్ ని కూడా ప్రకటించడంతో శేఖర్ కమ్ముల సినిమా వుంటుందా? లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాలంటే శేఖర్ కమ్ముల తను ధనుష్ తో చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్ గురించి అధికారికంగా మరోసారి ప్రకటించాల్సిందే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.