Begin typing your search above and press return to search.
ఆ హీరో ధియేటర్లను మూసేస్తున్నారు
By: Tupaki Desk | 4 Aug 2017 9:32 AM GMTఏదన్నా ఒక్క తప్పు జరిగిందంటే చాలు.. అప్పటివరకు చేసిన ఇతర తప్పులన్నీ కూడా ఒకేసారి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మలయాళం స్టార్ హీరో దిలీప్ పరిస్థితి అలాగే ఉంది. ఒక నటిని అపహరించి అత్యాచారం చేయించిన కేసులో మొదటి నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్న దిలీప్ ఇప్పుడు ఆలువా జైల్లో ఉన్నాడు. బెయిల్ కూడా దొరకట్లేదు. ఈ సందర్భంగా దిలీప్ కు ఇంకో షాక్ తగిలింది ఇప్పుడు.
కేరళలోని కొచిన్ కు 20 కిలోమీటర్లు దూరంలో చాలకుడి అనే ఊరుంది. అక్కడకు పర్యాటకులు విపరీతంగా వస్తుంటారు. ఆ టౌన్లో ఒక మల్టీప్లెక్స్ ధియేటర్ కట్టుకున్నాడు దిలీప్. 'డి సినిమాస్' పేరుతో నడిచే ఆ ధియేటర్ కట్టిన భూమిని అక్రమంగా లాక్కొన్నారంటూ చాలా ఆరోపణలు వచ్చాయి కాని.. అప్పట్లో వాటిని చక్కగా సైలెంట్ చేసేశారు. కాని ఇప్పుడు మాత్రం ఆ భూమిపై ఉన్న వివాదాలు తొలగేవరకు ఆ ధియేటర్లను మూసేయాలని చాలకుడి మున్సిపాలిటీ డిసైడైంది. పోలీసులు ఆ భూమి గురించి ఏదో ఒకటి తేల్చేవరకు ధియేటర్లను తెరవడానికి వీళ్లేదట. మూలిగే నక్కమీద తాటికాయ పడటం అంతే ఇదే కాబోలు.
ఇకపోతే నటి అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న దిలీప్.. అసలు ఎప్పుడు బెయిల్ మీద బయటకు వస్తాడో ఆయన ఫ్యాన్స్ కు అలాగే అతనిపై డబ్బులు పెట్టిన నిర్మాతలకు అర్దంకావట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సుప్రీం కోర్టును కదిపితే కాని బెయిల్ రాదేమోనని అనిపిస్తోంది న్యాయ నిపుణులకు. ఈ కేసు విచారణ పూర్తిగా పూర్తయితే కాని దిలీప్ కు బెయిల్ రాదంటూ ప్రాసిక్యుషన్ వర్గాలు చెబుతున్నాయి.