Begin typing your search above and press return to search.
రీల్ స్టోరీకి తీసిపోని కంటెంట్ దుల్కర్ పెళ్లి ఎపిసోడ్
By: Tupaki Desk | 31 July 2022 9:30 AM GMTభాషతో సంబంధం లేకుండా కొందరు నటులు నచ్చేస్తుంటారు. అలాంటి హీరోల్లో ముందుండే పేరు దుల్కర్ సల్మాన్. మలయాళ హీరో మమ్ముట్టి తనయుడే ఆయన. విలక్షణ చిత్రాల్ని చేయటం ఆయనకు అలవాటు. ఈ తరం హీరోనే అయినా ఇప్పటివారిలా 'ఇమేజ్' చట్రంలో చిక్కుకోకుండా సినిమాల్ని ఎంపిక చేసుకోవటంలో ఆయన మిగిలిన వారికి భిన్నమని చెప్పాలి. అందుకే.. భాషతో సంబంధం లేకుండా ఆయన సినిమాలన్నంతనే ఆసక్తిని ప్రదర్శించేలా చేసుకోవటంలో సక్సెస్ అయ్యారు. అందుకే.. దుల్కర్ సినిమా అంటే డిఫరెంట్ మూవీ అన్న మాట వినిపిస్తుంటుంది.
తొలిసారి తెలుగులో ఆయన చేస్తున్న స్ట్రెయిట్ మూవీ 'సీతారామం'. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ఆసక్తికరంగా మారింది. 'ఓకే బంగారం'తో పరిచయమై.. మహానటితో తెలుగు ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయిన అతగాడి వ్యక్తిగత విషయాల్లో అతని పెళ్లి ఎపిసోడ్ సినిమాటిక్ గా ఉంటుంది. రీల్ కంటెంట్ కు ఏ మాత్రం తీసిపోని రియల్ పెళ్లి ఆసక్తికరమని చెప్పాలి.
దుల్కర్ సల్మాన్ పెళ్లి రోటీన్ కు కాస్తంత భిన్నంగా చెప్పాలి. పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. తన పెళ్లి కథను దుల్కర్ మాటల్లో వింటే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. అందులోకి వెళ్లిపోదామా? 'నాది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. దైవ సంకల్పంగా భావిస్తా. ఎందుకంటే.. తను (అమల్ సూఫీది) చెన్నైకు చెందిన అమ్మాయి. తనకు తెలిసిన వాళ్లు మా అమ్మకు తెలుసు. వారి ద్వారా తన ఫోటోను పంపి.. మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చారు. దీంతో దుబాయ్ (అప్పట్లో ఉద్యోగం చేస్తుండేవాడిని) నుంచి నేను వచ్చిన తర్వాత నాకు తన ఫోటో చూపించి విషయం చెప్పారు. నేను పెద్దగా తనను పట్టించుకోలేదు' అని చెప్పారు.
అయితే.. ఒకసారి చెన్నైకి తాను వెళ్లినప్పుడు స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లానని.. తన ముందు సీట్లో తను కనిపించటం.. ఎక్కడో చూసినట్లు అనిపించిందని చెబుతూ.. 'తనని ఎక్కడో చూశాననిపించింది. అప్పటికి నేనింకా సినిమాల్లోకి రాలేదు. కాసేపటికి గుర్తుకు వచ్చింది. మరింత విచిత్రమైన విషయం ఏమంటే.. తను కాలేజీలో నాకు జూనియర్. అనుకోని విధంగా చోటు చేసుకున్న ఈ ఘటనలన్ని నాకు దైవ సంకల్పంగా అనిపించింది. వెంటనే విషయం మా అమ్మకు చెప్పా. ఆమె ఓకే చెప్పటంతో తనను డేట్ కు పిలిచా. తనకు కూడా నేనంటే ఇష్టమని చెప్పింది. దీంతో.. 2011లో పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాతే నేను సినిమాల్లోకి వచ్చా. మాకిప్పుడు మరియం అమైరా సల్మాన్ అనే ఆరేళ్ల కుమార్తె ఉంది' అంటూ తన పెళ్లికథను చెప్పుకొచ్చారు దుల్కర్. అతగాడి సినిమాల మాదిరే కాస్తంత భిన్నంగా ఉంది కదా?