Begin typing your search above and press return to search.

డ్రగ్స్ తప్పు గవర్నమెంటుదే అంటున్న నటి

By:  Tupaki Desk   |   6 Aug 2017 8:56 AM GMT
డ్రగ్స్ తప్పు గవర్నమెంటుదే అంటున్న నటి
X
అసలు డ్రగ్స్ స్కాండల్ అనేది కుదిపేస్తోంటే.. అందరూ కూడా సినిమా సెలబ్రిటీలు ఈ కల్చర్ ను బాగా పాపులర్ చేస్తున్నారు అన్నవారే తప్పించి.. అసలు ఇన్నిరోజులు వీటిని అరికట్టాల్సిన అధికారులు ఎలా కళ్ళు మూసుకుని కూర్చున్నారు అని ప్రశ్నించిన నాదులే లేరు. అంతేగాక ఇప్పుడు మాత్రం ఎవరికివారే విక్రమార్కుడులో రాథోడ్ రవితేజ టైపులో క్లాసులు పీకడం ఒకటి. వీటన్నింటిపై నటి హేమ మాత్రం ఘాటుగానే స్పందించింది.

''ఒకప్పుడు జూబ్లీ హిల్స్ ఏరియాలో ఓ రెండు మూడు పబ్బులు ఉండేవి. ఇప్పుడు చూస్తే ఓ రెండు డజన్లు ఉన్నాయి. అసలు పబ్బుల్లోనే కదా ఈ డ్రగ్స్ వంటివి అమ్ముతున్నారు అంటున్నారు.. అలాంటప్పుడు ఆ పబ్బులకు ప్రభుత్వాలు పర్మిషన్లు ఎందుకు ఇచ్చినట్లు? కేవలం వాళ్ళకు వచ్చే లైసెన్స్ ఫీ కోసం పర్మిషన్లు ఇస్తే ఇక్క సొసైటీ పాడవ్వట్లేదా?'' అంటూ కడిగేసింది హేమ. ఒక ఇంటర్యూలో మాట్లాడుతూ.. ప్రభుత్వాలు చేస్తున్న పనుల వలన పేరెంట్స్ నష్టపోతున్నారని చెప్పింది.

''నా కూతురు ఫ్రెండ్స్ తో బయటకు వెళతా అంటోంది. భయపడి పంపించకపోతే బ్యాడ్ మథర్ అంటారు. అలాగని పంపిస్తే ఏ డ్రగ్స్ సెగ తాగుతుందోనని నాకు భయంగా ఉంది. నాదే కాదు.. చాలామందిది ఇదే పరిస్థితి'' అంటూ ఎద్దేవా చేసింది హేమ. ఆమె చెప్పినదాంట్లో కూడా నిజముందిలే మరి!!