Begin typing your search above and press return to search.

మీడియా `ద‌య‌`తో ఇండ‌స్ట్రీ ఏక‌మైంది: హేమ‌

By:  Tupaki Desk   |   18 April 2018 10:03 AM GMT
మీడియా `ద‌య‌`తో ఇండ‌స్ట్రీ ఏక‌మైంది: హేమ‌
X
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై శ్రీ‌రెడ్డి ఆరోప‌ణ‌లు, సినీ న‌టుడు, జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై శ్రీ‌రెడ్డి అభ్యంత‌ర వ్యాఖ్య‌ల‌పై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి ఒక్క‌రికీ ఇండ‌స్ట్రీ అంటే లోకువ‌యింద‌ని, ఇక‌పై ఇండ‌స్ట్రీని ఉద్దేశించి చుల‌క‌న‌గా మాట్లాడొద్ద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ప‌వ‌న్ ను వ్య‌క్తిగతంగా టార్గెట్ చేస్తున్నార‌ని, రాజ‌కీయంగా కావాల‌నే ప‌వ‌న్ పై బుర‌ద జ‌ల్లేందుకు ఈ త‌ర‌హా నీచాలకు పాల్ప‌డుతున్నార‌ని నిప్పులు చెరిగారు. నాగబాబు మాట్లాడిన ప్రెస్ మీట్ లో ప్రముఖ నటి హేమ మాట్లాడారు. ఇండస్ట్రీని దూషిస్తున్న వారిపై హేమ మండిప‌డ్డారు. ప్ర‌తి ఒక్క‌రూ ఇండ‌స్ట్రీని దూషించడం సరికాదని హేమ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఇండ‌స్ట్రీలోని మ‌హిళ‌ల‌నుద్దేశించి అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన ఓ టీవీ చానెల్ యాంక‌ర్ పై కూడా హేమ నిప్పులు చెరిగారు. అటువంటి ప‌దాల‌ను నేర్చుకొని ఆ న్యూస్ ఛానల్స్‌లో న్యూస్ రీడర్స్ అయ్యారని హేమ సెటైర్ వేశారు. ఈ ప్రెస్ మీట్ లో హేమ‌...కొన్ని మీడియా చానెళ్ల వైఖ‌రిని కూడా దుయ్య‌బ‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా కొన్ని న్యూస్ ఛానల్స్ పై హేమ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప‌రోక్షంగా శ్రీ‌రెడ్డిని ప్ర‌స్తావిస్తూ అనేక వ్యాఖ్య‌లు చేశారు. లైవ్ డిబేట్ల‌లో ఆవిడ పర్సనల్ విషయాలు మాట్లాడ‌వ‌ద్ద‌ని చెబుతార‌ని, త‌మ‌కు మాత్రం పర్సనల్ విషయాలు..కుటుంబాలు ఉండ‌వా అని హేమ ప్ర‌శ్నించారు. న‌టుల‌మైన పాపానికి త‌మ కుటుంబాల ప‌రువు మంట‌గ‌లుపుతారా అంటూ మండిప‌డ్డారు. ఈ డిబేట్లలో ఇండస్ట్రీని దూషించడం వ‌ల్ల‌యినా.....తమ‌లో యూనిటీ పెరుగుతోందని మీడియా చానెళ్ల‌నుద్దేశించి చ‌మ‌త్క‌రించారు. ప‌వ‌న్ పై శ్రీ‌రెడ్డి చేసిన అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌పై హేమ స్పందించారు. మ‌రో నలుగురిని తీసుకుని వచ్చి మిగిలిన హీరోల తల్లులని కూడా తిట్టిస్తే...ఇండ‌స్ట్రీలోని తామంతా ఇంకా ఐకమత్యంగా మారుతామని హేమ అన్నారు. ఆడవారికి భద్రత ఉందని మీడియా ఛానల్స్ వారు చెప్పిన చోటికి వెళ్లి ఉద్యోగాలు చేస్తామ‌ని మీడియా ప్ర‌తినిధుల‌నుద్దేశించి హేమ వ్యాఖ్యానించారు. దాదాపుగా అన్నిరంగాల్లో మ‌హిళ‌ల‌పై వేధింపులు - వివ‌క్ష ఉంద‌ని...కానీ సినీరంగాన్ని మాత్ర‌మే టార్గెట్ చేస్తున్నార‌ని హేమ అన్నారు. మ‌హిళ‌ల‌నుద్దేశించి చలపతి బాబాయ్ అన్న మాటకు మహిళాసంఘాలు గొడ‌వ చేశాయ‌ని,....పవన్ కళ్యాణ్ తల్లిని అంత పెద్ద మాట అన్న ఆమెను మహిళా సంఘాలు ఎందుకు వ‌దిలేశాయ‌ని ప్రశ్నించారు.